ఆ ఇద్దరు పెద్ద హీరోయిన్ల వల్లే నాకు అవకాశాలు రావట్లేదు... అవికా గోర్ సంచలన కామెంట్స్!  

అవికా గోర్..చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయిన నటి..ఆ సీరియల్లో అవికా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది.. ఆ సీరియల్ తర్వాత ససురాల్ సిమర్ కా అనే సీరియళ్లో ఇద్దరు హీరోయినల్లో ఒకరిగా నటించింది.ఈ సీరియల్ కూడా తెలుగులో డబ్ అయింది.ఆ తర్వాత ఉయాల జంపాలతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయి హిట్ కొట్టింది.లక్ష్మి రావే మా ఇంటికి,సినిమా చూపిస్తా మావా,ఎక్కడికి పోతావ్ చిన్నవాడా లాంటి హిట్స్ అవికా ఖాతాలో ఉన్నాయి..కానీ అవికా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది అనే వార్త ఒకటి వినిపిస్తుంది.ఎందుకు అవికా సినిమాలకు దూరం అవుతుంది.

Avika Gor Clarity On Acting In Movies-

Avika Gor Clarity On Acting In Movies

గతంలో కూడా టాలివుడ్ కి చెందిన ఒక హీరోతో వేదింపులు ఎదుర్కొంది అవికా.అశ్లీల మెసేజ్ లు,వీడియోలు సెండ్ చేస్తున్న ఆ హీరో గురించి టాలివుడ్ లో తనకు క్లోజ్ ఫ్రెండ్స్ అయిన ఇతర నటులతో చెప్పుకుని బాదపడింది.అప్పుడు కూడా ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలనుకుంది.కానీ తనను తాను తమాయించుకుని తర్వాత సినిమా చూపిస్తా మావా,ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలు చేసింది.ఇప్పుడు అవికాకు వరుస ఆఫర్లు వస్తాయి అనుకుంటున్న టైంలో అవికా సినిమాలకే గుడ్ బై చెప్పనుందని వార్తలోస్తున్నాయి..తానెక్కడ సినిమాలకు గుడ్ బై చెప్తున్నట్టు అనలేదని ,ఈ వార్తలు అబద్దం అని అవికా గోర్ ఖండించింది.ఇద్దరు పెద్ద సెలబ్రిటీ హీరోయిన్లు తనకు అవకాశాలు రాకుండా చేస్తున్నారని,తనకు ఛాన్స్ లు ఇవ్వకూడదని డైరెక్టర్ లకు చెప్పారిన చెప్తూ బాదపడింది..ఇక్కడెలాగూ ఛాన్స్ లేవు,కనీసం బాలివుడ్ లో అయినా ట్రై చేద్దాం అని ముంబై కి షిప్ట్ అయ్యే ప్లాన్లో ఉందట..

సినిమా ఫీల్డ్ లోనే కాదు ప్రతి చోట ఇలాంటి రాజకీయాలు కామనే..ఒకరి మనకంటే ఎత్తుకి ఎదుగుతున్నారనుకుంటే తొక్కేయాలని చూడడం..అలాంటప్పుడే ఇంకా కసితో పని చేయాలి..అవికా పరిస్థితులను ఎదుర్కొని నిలబడుతుందా లేదా అనేది చూడాలి.