‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకుల్లో స్థానం సంపాదించిన అవికా గౌర్ ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈమెను హీరోయిన్గా కూడా తెలుగు ప్రేక్షకులు ఆధరించారు.
మొదటి సినిమా సక్సెస్ అవ్వడంతో ఈమెకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి.ఇక ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వస్తున్న సమయంలో కాస్త లావు అయ్యింది.
దాంతో ఈమె బరువుపై విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.ఆ మధ్య ఈమె నటించిన ‘సినిమా చూపిస్త మావ’ సినిమాలో హీరో రాజ్ తరుణ్ కంటే కూడా అధికంగా లావుగా కనిపించింది.
దాంతో ఈమెకు ఆఫర్లు తగ్గు ముఖం పట్టాయి.ఒక ఆఫర్ చేతి వరకు వచ్చి మరీ జారి పోయింది.
దాంతో ఈమె లావు తగ్గాలని నిర్ణయించుకుని, అనుకున్నట్లుగానే లావు తగ్గింది.
నాలుగు నెలల్లో అవికా గౌర్ దాదాపు 6.5 కేజీల బరువు తగ్గినట్లుగా సమాచారం అందుతోంది.తాజాగా ఒక అవార్డు వేడుకలో పాల్గొన్న అవికా గౌర్ అందరిని అవాకయ్యేలా చేసింది.
ఈమె చాలా నాజూకుగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.లావు తగ్గినా కూడా మొహంలో కల తప్పకుండా ఉందని ఆమె సన్నిహితులు మరియు శ్రేయోభిలాషులు అంటున్నారు.
ఇక ఈమెకు టాలీవుడ్లో వరుసగా ఆఫర్లు వస్తాయేమో చూడాలి.తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈమె హీరోయిన్గా నటించే అవకాశాలున్నాయి.
మరో వైపు హిందీ సీరియల్స్‌ను చేస్తూనే ఉంది.