జర్నలిస్ట్ గా అవికాగోర్.. ఏ సినిమాలో అంటే?

నటీనటులు నటించే పాత్రలే సినిమా లోని ఒక భాగము.అందుకే వారి పాత్రల గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు దర్శకనిర్మాతలు.

 Avika Gor As Journalist-TeluguStop.com

ఇక కథకు తగ్గట్టుగా పాత్ర ఉండడం ఒక ఎత్తయితే.నటించే నటీనటులు ఆ పాత్రలకు ప్రాణం పోయడం మరొక ఎత్తు.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాలలో హీరో పాత్రల కంటే హీరోయిన్స్ పాత్రలు కూడా ఒక ప్రాధాన్యత కలిగి ఉంటుంది.దానితోనే సినిమా స్టోరీ కూడా ఉంటుంది.

 Avika Gor As Journalist-జర్నలిస్ట్ గా అవికాగోర్.. ఏ సినిమాలో అంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక పలు సినిమాలలో జర్నలిస్టుగా ఎందరో హీరోయిన్స్ నటించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు తాజాగా ఉయ్యాల జంపాల హీరోయిన్ అవికా గోర్ కూడా జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందట.

ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న సినిమా ‘అమరన్ ఇన్ ది సిటీ చాప్టర్ 1′.ఈ సినిమాలో ఆది సరసన అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ ఈ సినిమాతో బల్ వీర్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు.ఇక ఈ సినిమాను సజ్జ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నాడు.

ఇందులో అవికాగోర్ జర్నలిస్టు పాత్రలో కనిపించనుందట.ఆమె ఓ కేసును శోధిస్తున్న సమయంలో ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా కథ తెరకెక్కనుంది.ఇదిలా ఉంటే అవికాగోర్ ఇదివరకే సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజుగారి గది 3 సినిమాల్లో నటించడం చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వనుంది.ముందు నటించిన సినిమాలలో ఆమె మామూలు పాత్రల్లో నటించగా ఇక ఈ సినిమాలో జర్నలిస్టు పాత్ర లో ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

తెలుగు సినిమాలలో కొందరు హీరోయిన్స్ నటించిన జర్నలిస్టు పాత్రలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

#Avika Gor #Adi Sai Kumar #Journalist

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు