మర్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుండి విడుదలైన అవేంజెర్స్ చివరి భాగం అవేంజెర్స్ ఎండ్ గేమ్.ప్రస్తుతం ఈ సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.
సినిమా విడుదలైన మొదటి రోజు నుండే భారీగా కలెక్షన్ లు వస్తున్నాయి.ఇదిలాగే సాగుతుంటే జేమ్స్ కెమెరూన్ తీసిన అవతార్ కలెక్షన్ లు అందుకోవచ్చు అని ట్రేడ్ పండితుల అభిప్రాయం
ఇండియా లో దుమ్మురేపుతున్న అవేంజెర్స్ ఎండ్ గేమ్
మన దేశం లో గత దశాబ్దం నుండి హాలీవుడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది.
మర్వెల్ నుండి వచ్చిన ప్రతి సినిమా ఇండియా లో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా కలెక్షన్ లు సాధించాయి.అయితే అవేంజెర్స్ ఎండ్ గేమ్ మాత్రం ఏకంగా తొలి రోజే 53.10 కోట్ల నెట్ వసూలు చేసింది.ఇండియా లో రిలీజ్ అయిన అన్ని హాలీవుడ్ సినిమాలో ఇదే మొదటి రోజు అత్యధిక కలెక్షన్ లు సాధించిన సినిమా గా నిలిచింది.
బాలీవుడ్ లో మొదటి రోజు అత్యదిక కలెక్షన్ లు సాధించిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ( 52 కోట్లు ) రికార్డ్ ను కూడా బ్రేక్ చేసింది.ప్రస్తుత పరిస్థితి చూస్తే అవేంజెర్స్ ఎండ్ గేమ్ ఒక భారత్ లొనే 300 కోట్ల కలెక్షన్ లు సాధించే అవకాశం ఉంది.
ఈ సినిమా బాహుబలి పార్ట్ 1 మొదటి రోజు కలెక్షన్ లను సైతం దాటేసింది.భారత్ లో మొదటి రోజు అత్యధిక కలెక్షన్ లు సాధించిన చిత్రాలలో బహుబాలి 2 , రోబో 2.0 చిత్రాల తరువాత 3 వ స్థానం లో అవేంజెర్స్ ఎండ్ గేమ్ నిలిచింది
ప్రపంచ వ్యాప్తంగా కూడా సినిమా కి భారీగా కలెక్షన్ లు వస్తున్నాయి.ముఖ్యంగా చైనా , అమెరికా దేశాల నుండి.
ప్రపంచ వ్యాప్తంగా అవేంజెర్స్ ఎండ్ గేమ్ సినిమా దాదాపుగా 2100 కోట్లు వసూలు చేసింది
మన దేశం లో తొలి రోజు అత్యధిక కలెక్షన్ లు సాధించిన సినిమాలు
1.బాహుబలి ధి కంక్లూజిన్ – 122 కోట్లు2.రోబో 2.0 – 54 కోట్లు3.అవేంజెర్స్ ఎండ్ గేమ్ – 53.10 కోట్లు4.థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ – 52 కోట్లు5.బాహుబలి బిగినింగ్ – 50 కోట్లు
.