అల్లు అర్జున్‌ మూవీలో ఇద్దరు హీరోలు... మల్టీస్టారర్‌ కాదు  

Navdeep And Sushanth In Allu Arjun Trivikram Third Movie-

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ల మూవీ ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది.ఆరు నెలలుగా అదుగో ఇదుగో అంటూ వాయిదాలు వేస్తూ వచ్చిన ఈ హిట్‌ కాంబో మూవీ షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం అవ్వడంతో మెగా ఫ్యాన్స్‌ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Navdeep And Sushanth In Allu Arjun Trivikram Third Movie-

వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే ‘జులాయి’ మరియు ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాలు వచ్చాయి.ఆ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను దక్కించుకున్నాయి.

ఇప్పుడు వీరి కాంబోలో రాబోతున్న మూవీతో హ్యాట్రిక్‌ సాధిస్తారనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

Navdeep And Sushanth In Allu Arjun Trivikram Third Movie-

ఇక ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించబోతుంది.

ఇప్పటికే ఆ విషయం కన్ఫర్మ్‌ అయ్యింది.కీలక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ టబును ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.ఇక తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్‌ ప్రకారం ఈ చిత్రంలో ఇద్దరు యంగ్‌ హీరోలు కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

యంగ్‌ హీరో నవదీప్‌ మరియు అక్కినేని హీరో సుశాంత్‌.

వీరిద్దరు కథలో చాలా కీలకంగా ఉంటారని, అయితే వీరిద్దరు హీరోలుగా మాత్రం కనిపించరని తెలుస్తోంది.వీరిద్దరిలో ఒకరు విలన్‌గా కనిపించబోతుండగా, మరో హీరో అల్లు అర్జున్‌కి స్నేహితుడి పాత్రలో కనిపించబోతున్నాడు.ఆ స్నేహితుడిగా నటించే పాత్ర చనిపోతుందని, ఆ స్నేహితుడి మరణం చుట్టు కథ తిరుగుతుందని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మొత్తానికి అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబో మూవీ అంచనాలు పెంచేస్తోంది.

.

తాజా వార్తలు

Navdeep And Sushanth In Allu Arjun Trivikram Third Movie- Related....