వాట్సాప్ డీపీగా అవతార్స్ వచ్చేస్తున్నాయ్.. ఎలా అంటే అలాగా!

ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ దిగ్గజ సంస్థ వాట్సాప్ తన యూజర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే వుంది.తాజాగా ఓ అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

 Avatars Are Coming As Whatsapp Dp That S How It Is , Whatsapp , Dp , Avatar , N-TeluguStop.com

ఇప్పటి వరకు వాట్సాప్ DP (డిస్‌ప్లే పిక్చర్)గా ఎవరికీ వారు వారి సొంత ఫొటోలనో లేక తమకి ఇష్టమైన వారి ఫొటోలనో డీపీలుగా పెట్టుకునేవారు.ఇపుడు రానున్న ఫీచర్ తో తమ సొంత అవతార్స్ పెట్టుకునే వీలు కల్పించాలని వాట్సాప్ భావిస్తోంది.

తాజాగా ఈ విషయాన్ని WABetaInfo వెల్లడించింది.

ఇక ఈ కొత్త ఫీచర్ ద్వారా అవతార్స్‌ను డీపీగా ఎలా పెట్టుకోవచ్చో చూపించే ఒక ఫొటో బయటకు వచ్చింది.

దీంతోపాటు బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ను కూడా మార్చుకునే వెసులుబాటు ఇందులో ఉంటుంది.అంతేకాదు, వీడియో కాల్స్ చేసినప్పుడు కూడా ఇలాంటి యానిమేటెడ్ అవతార్లతో కాల్ మాట్లాడే వీలు కల్పించాలని వాట్సాప్ ప్రయత్నిస్తోందట.

ఈ ఫీచర్ గాని పూర్తిగా అందుబాటులోనికి వస్తేమాత్రం యూజర్లు ఓ కొత్త అనుభవాన్ని పొందుతారని వాట్సాప్ యాజమాన్యం సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.

Telugu Avatar, Testers, Ups, Whatsapp, Whatsapp Dp-Latest News - Telugu

ఇకపోతే వాట్సాప్ తాజాగా ‘Delete For Everyone’ ఫీచర్‌లో కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసిన విషయం విదితమే.ఇక దీని వలన యూజర్లు రెండు రోజుల క్రితం పంపిన మెసేజ్‌లను కూడా డిలీట్ చేసుకోవడం సాధ్యపడుతుంది.ఇంతకుముందు గంట క్రితం పంపిన మెసేజ్‌లు మాత్రమే అందరికీ డిలీట్ చేయడం కుదరేది.

ఈ టైమ్ లిమిట్ ఇప్పుడు పెరిగింది.ఈ ఫీచర్ టెస్టర్లకు కొన్ని వారాల క్రితమే తీసుకువచ్చింది.

మొదటగా ఈ సమయాన్ని ఏడురోజుల వరకు పొడిగించాలని భావించింది కానీ దీనివల్ల ప్రైవసీకి భంగం వాటిల్లే అవకాశం ఉంటుందని రెండు రోజుల వరకు పొడిగించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube