Avatar 2: 16,000 కోట్ల రూపాయల టార్గెట్.. అవతార్2 కు ఆ రేంజ్ కలెక్షన్లు సాధ్యమా?

మరో 20 రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానున్న అవతార్2 సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాగా రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతుండటంతో ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నాయి.

 Avatar2 Movie Target Is 16000 Crores Details, Avatar 2, Avatar , Avatar 2 Movie-TeluguStop.com

అయితే అవతార్2 మూవీ టార్గెట్ ఏకంగా 16000 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.

అయితే ప్రపంచవ్యాప్తంగా అవతార్2 16000 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం సాధ్యమేనా అనే ప్రశ్నకు పాజిటివ్ టాక్ వస్తే కష్టమేం కాదనే కామెంట్ వినిపిస్తోంది.200 రూపాయల నుంచి 1550 రూపాయల వరకు ఈ మూవీ టికెట్ రేట్లు ఉండటంతో ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు చూడకపోయినా ఈ సినిమాకు భారీ స్థాయిలో టికెట్ రేట్లు ఉండే అవకాశం అయితే ఉందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

జేమ్స్ కామెరూన్ అవతార్2 సినిమాతో అద్భుతం చేయడం గ్యారంటీ అని కొంతమంది నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Telugu Avatar, Avatar Target, Avatar Pre, James Cameroon-Movie

అవతార్2 ఫుల్ రన్ కలెక్షన్లు ఈ రేంజ్ లో ఉంటాయో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.అవతార్2 ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని కోరుకుంటున్నారు.డిసెంబర్ 16వ తేదీ రిలీజ్ కానున్న ఈ సినిమాకు పోటీగా తమ సినిమాలను రిలీజ్ చేయడానికి చాలామంది నిర్మాతలు ఇష్టపడటం లేదు.

Telugu Avatar, Avatar Target, Avatar Pre, James Cameroon-Movie

అవతార్2 బాక్సాఫీస్ వద్ద కనీసం 2 నుంచి 3 వారాల పాటు ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉంది.అవతార్2 సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వచ్చాయని బోగట్టా.ప్రముఖ మల్టీప్లెక్స్ లు ఈ సినిమాకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాయి.నెగిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమాకు భారీ స్థాయిలో నష్టాలు వస్తాయని చెప్పవచ్చు.అవతార్2 ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube