రామాయణ్ త్రీడీలో రావణుడు కోసం అవతార్ టీమ్

మధు మంతెన, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా బాలీవుడ్ లో రామాయాణం త్రీడీ వెర్షన్ లో నాలుగు బాగాలుగా మూవీని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే.ఇక ఈ మూవీ రాముడు పాత్రని ఎవరు చేయబోతున్నారు అనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

 Avatar Costume Team To Style Hrithik Roshan As Ravana-TeluguStop.com

అయితే రావణుడుగా మాత్రం హృతిక్ రోషన్ కనిపించబోతున్నాడు.ఇప్పటికే అతను ఖరారైనట్లు బిటౌన్ లో టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాని సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తెరకెక్కించబోతున్నారు.మూవీలో సీతగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే నటించబోతుందని తెలుస్తుంది.

 Avatar Costume Team To Style Hrithik Roshan As Ravana-రామాయణ్ త్రీడీలో రావణుడు కోసం అవతార్ టీమ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే రామాయణం కథ అందరికి తెలిసిందే కావడంతో దీనిని తెరపై కొత్తగా ప్రేక్షకులని మెప్పించే విధంగా ఏ విధంగా ఆవిష్కరిస్తారు అనేది తెలియాల్సి ఉంది.ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ మూవీలో రావణుడు పాత్ర కాస్తా విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.దానికోసం హృతిక్ రోషన్ ని రావణుడుగా ఆవిష్కరించేందుకు అవతార్ మూవీకి పని చేసిన కాస్ట్యూమ్ డిజైనర్స్, మేకప్ బృందాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది.

వీరి ఆధ్వర్యంలో సరికొత్తగా రావణుడు పాత్రలో హృతిక్ ని ఆవిష్కరిస్తారని తెలుస్తుంది.ఇక రాముడు పాత్ర కోసం టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, ప్రభాస్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.

అయితే ప్రభాస్ ఇప్పటికే ఆది పురుష్ కోసం శ్రీరాముడుగా మారుతున్నాడు.ఈ నేపధ్యంలో మహేష్ మాత్రమే వారికి ఛాయస్ గా ఉన్నట్లు తెలుస్తుంది.

అలాగే జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా పరిశీలిస్తున్నట్లు బోగట్టా.

#Ravana #HrithikRoshan #Madhu Manthena #Hrithik Roshan #Allu Aravind

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు