Avatar 2 Movie: అవతార్ 2 రిలీజ్.. ఆ టికెట్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

అవతార్‌.ఈ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

 Avatar 2 Movie Tickets Booking Prices Shocking Audience Details, Avatar, Avatar-TeluguStop.com

అవతార్‌ 1 సినిమా విడుదల అయి ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.ఇక అవతార్‌2 సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అయితే ఎట్టకేలకు ప్రేక్షకుల ఎదురుచూపులు ఫలించాయి.హాలీవుడ్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన అవతార్‌2 సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16వ తేదీన విడుదల కానుంది.

భారీ అంచనాలను విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.

కాగా 9 ఏళ్ల క్రితం వచ్చిన అవతార్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి.ఈ హాలీవుడ్ చిత్రం ఇంగ్లీష్‌తో పాటుగా ఏడు భాషల్లో విడుదల కానుంది.అయితే ఈ సినిమాను చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సినీ ప్రేక్షకులకు విడుదలకు ముందే షాక్ తగిలింది.ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ సైట్స్‌, యాప్‌లు ప్రధాన నగరాల్లోని థియేటర్స్‌లో బుకింగ్స్‌ అందుబాటులోకి వచ్చాయి.

ఈ చిత్రాన‍్ని ఐమ్యాక్స్‌ 3డీ, 4డీఎక్స్‌ 3డీ ఫార్మాట్‌ లలోనూ విడుదల చేస్తుండటంతో ఆ స్క్రీన్‌ల పైనే చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.

Telugu Avatar, Avatar Ticket, James Cameroon, Hollywood, Tickets-Movie

అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆ స్క్రీన్‌ల టికెట్‌ ధరలు చూసి సినీ ప్రేక్షకులు షాక్‌కు గురవుతున్నారు.ఓ ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ సైట్‌ బెంగళూరులోని ఐమ్యాక్స్‌ 3డీ ఫార్మాట్‌ కలిగిన థియేటర్‌లో టికెట్‌ ధర ఏకంగా రూ.1,450 చూపిస్తోంది.అలాగే పుణెలో రూ.1200, డిల్లీలో రూ.1000గా ఉంది.అలాగే ముంబయిలో రూ.970, కోల్‌కతా రూ.770, అహ్మదాబాద్‌ రూ.750, ఇండోర్‌ రూ.700 ఉండగా, హైదరాబాద్‌లో ఒక్కో టికెట్‌ ధర రూ.350 విశాఖ రూ.210 ఉంది.ఈ ధరలన్నీ సాధారణ సీట్లకు సంబంధించినవి మాత్రమే.ఇంకా వీటికి పన్నులు, ఇంటర్నెట్‌ ఛార్జీలు అదనపు భారం కానున్నాయి.అయితే త్వరలోనే సాధారణ థియేటర్స్‌ లోనూ టికెట్‌ ధరలు అందుబాటులో ఉంచనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube