స్టార్ హీరో రవితేజ కాల్ చేస్తే అవసరాల అలా అన్నారట.. అసలేమైందంటే?

నటుడిగా, దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.అవసరాల శ్రీనివాస్ నటించిన నూటొక్క జిల్లాల అందగాడు సినిమా సెప్టెంబర్ 3వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

 Avasarala Srinivas Interesting Comments About Hero Raviteja , Avasarala Srinivas-TeluguStop.com

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అలీతో సరదాగా షోకు హాజరైన అవసరాల శ్రీనివాస్ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.తన హైట్ 6.4 అడుగులని ఎవరికైనా అవసరమైతే హైట్ ఇచ్చేయాలని ఉంటుందని అవసరాల శ్రీనివాస్ తెలిపారు.

సినిమా అంటే చాలా ఇష్టమని సినిమా తీయడం సాధ్యం కాదని ఎవరైనా చెప్పినా తాను వినలేదని అవసరాల శ్రీనివాస్ అన్నారు.

సినిమా గురించి తనకేం తెలీదని తనకు తెలుసని అయితే ఏదో ఒకటి తెలుస్తుందని కూడా తెలుసని అవసరాల శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.అష్టాచమ్మా అడిషన్ కు సెలెక్ట్ అయినట్టు సినిమా చేసినట్టు సినిమా ట్రైలర్ విడుదలయ్యే వరకు అమ్మానాన్నకు కూడా తెలియదని అవసరాల శ్రీనివాస్ అన్నారు.

నాన్న అష్టాచమ్మా ట్రైలర్ చూడగానే సినిమాల్లో చేస్తే చేశావ్ కానీ ఇంకెప్పుడు చెయ్యకు అని అన్నారని అవసరాల శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.చిన్నప్పుడు సినిమాలు చూసే సమయంలో సినిమాల్లో యాక్టర్లు తప్ప వేరేవాళ్లు ఉంటారని తెలియదని అవసరాల శ్రీనివాస్ అన్నారు.ఊహలు గుసగుసలాడే సినిమా చేసే సమయంలో మాత్రం తనను ప్రశంసించారని అవసరాల శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

అష్టాచమ్మా మూవీ చూసి రవితేజ కాల్ చేస్తే కాల్ మాట్లాడిన తర్వాత పేరు అడిగానని నన్ను రవితేజ అంటారని రవితేజ చెప్పారని అవసరాల శ్రీనివాస్ కామెంట్లు చేశారు.ఫోర్జరీ సంతకాలు తాను బాగా పెట్టేవాడినని వివాదాలు సినిమాకు హెల్ప్ అవుతాయని తాను అనుకోనని అయితే నూటొక్క జిల్లాల అందగాడు సినిమాకు కాంట్రవర్సీ అవసరమని అలా చేశామని అవసరాల శ్రీనివాస్ పేర్కొన్నారు.నూటొక్క జిల్లాల అందగాడు సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube