మంత్రి గంటా వ‌ర్సెస్‌.. ఎంపీ అవంతి.. టికెట్ కోస‌మే!     2018-05-07   23:30:21  IST  Bhanu C

ఏపీ అధికార పార్టీలో టికెట్ల రాజుకుని మంట‌లు పైకి లేస్తున్నాయి! నిన్న మొన్న‌టి వ‌ర‌కు క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ సీటు కోసం మంత్రి అఖిల ప్రియ‌, టీడీపీ సీనియ‌ర్ నేత‌, దివంగ‌త భూమా అనుచ‌రుడు ఏవీ సుబ్బారెడ్డిల మ‌ధ్య త‌లెత్తిన వివాదం స‌ర్దు మ‌ణ‌గ‌డం త‌ల‌ప్రాణం తోక‌కు తెచ్చిన‌ట్ట‌యింది. ఇది స‌ర్దు మ‌ణిగిందిలే అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఊపిరి పీల్చుకునే స‌రికి.. ఇప్పుడు విశాఖ కేంద్రంగా మ‌రో వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. ఇక్క‌డ కూడా టికెట్ వివాద‌మే ప్ర‌ధాన ఇష్యూ కావ‌డం గ‌మ‌నార్హం. అది కూడా మంత్రి వ‌ర్సెస్ ఎంపీ కావ‌డం మ‌రింత ఆస‌క్తిక‌రం. మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉండ‌డంతో టీడీపీలో టికెట్ల గోల ఎక్కువైంది. ఎక్క‌డిక‌క్క‌డ నేత‌లు త‌మ టికెట్ల కోసం ముందుగానే క‌ర్చీఫ్‌లు వేసుకునే ప‌రిస్థితి వ‌చ్చింది.

దీంతో నేత‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు టికెట్ ల‌భిస్తుందో లేదోన‌నే బెంగ‌తో కొంత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. తాజాగా ఇదే ప‌రిస్థితి విశాఖ‌లోనూ చోటు చేసుకుంది. అన‌కాప‌ల్లి ఎంపీ ముత్తంశెట్టి(అవంతి) శ్రీనివాస్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని ఎప్ప‌టి నుంచో భావిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ అధికారంలోకి వ‌స్తే.. ఏదో విధంగా తిప్ప‌లు ప‌డి మంత్రి ప‌ద‌వి ప‌ట్టాల‌ని ఈయ‌న ప్లాన్‌. అయితే, విశాఖ మొత్తంలో త‌న‌కు అనుకూలంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం భీమిలి. గ‌తంలో అవంతి ఇక్క‌డ పోటీచేయ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని ఆయ‌న భావించారు.