విడ్డూరం : ఇలాంటి దొంగను మీరెప్పుడు చూసి ఉండరు

కొందరు తిండికి లేక దొంగతనాలు చేస్తారు, మరి కొందరు విలాసవంతమైన జీవితం కోసం దొంగతనాలు చేస్తారు.తిండికి లేక దొంగతనాలు చేయడం పెద్దగా తప్పు అనిపించదు.

 Auttarakhand Man Change Tothieffor Brand Costlycloths-TeluguStop.com

తిండికి లేని వారు చిన్న చిన్న దొంగతనాలు చేసి తింటారు.కాని కొందరు వారి వద్ద లక్షలు ఉంటే కోట్ల రూపాయలను టార్గెట్‌ చేస్తారు.

ప్రతి ఒక్కరిలో కూడా దొంగ అనే వాడు ఉంటాడట.అయితే ఆ దొంగను కాస్త అటు ఇటుగా ఉంటాడు.

కొందరు పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తే కొందరు చిన్న చిన్న దొంగతనాలు చేస్తారు.కొందరు చేసే వాటిని దొంగతనం కూడా అనలేం.

ఇప్పుడు నేను చెప్పబోతున్న దొంగ మాత్రం చాలా ప్రత్యేకం.

Telugu Telugu Ups, Thief, Uttarakhand-

40 ఏళ్ల అక్రమ్‌ ఉత్తరాఖండ్‌కు చెందిన వ్యక్తి.ఈయనకు మొదటి నుండి కూడా బ్రాండెడ్‌ దుస్తులు అంటే చాలా మోజు.ఆ మోజు బ్రాండెడ్‌ దుస్తులను కొనుగోలు చేసేందుకు అప్పులు చేసేవాడు.

వేలకు వేలు పెట్టి బ్రాండెడ్‌ దస్తులు కొనుగోలు చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసేవారు.కుటుంబ సభ్యులతో గొడవ కారణంగా బ్రాండెడ్‌ దుస్తులే తనకు ముఖ్యం అంటూ ఢిల్లీ వచ్చి పడ్డాడు.

ఎలాగైనా బ్రాండెడ్‌ దుస్తులు కొనుగోలు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో దొంగతనంకు సిద్దం అయ్యాడు.

Telugu Telugu Ups, Thief, Uttarakhand-

బ్రాండెడ్‌ దస్తుల కోసం వేలు లక్షల రూపాయలు ఖర్చు చేయాలంటే విచ్చలవిడిగా చేతిలో డబ్బులు ఉండాలి.అవి కష్టపడితే రావు.ఈజీగా ఆ డబ్బు సంపాదించాలంటే దొంగతనం ఒక్కటే మార్గం అనుకున్నాడు.

అందుకే దొంగతనంకు సిద్దం అయ్యాడు.ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలో చొరబడి డబ్బు, బంగారంను దోచుకుంటూ వస్తున్నాడు.

బంగారంను తనకు తెలిసిన వ్యక్తి వద్ద కరగదీస్తూ దాన్ని మార్కెట్‌లో అమ్ముకుంటూ బ్రాండెడ్‌ దుస్తులు వేసుకునేవాడు.

Telugu Telugu Ups, Thief, Uttarakhand-

  వేసుకునే డ్రస్‌లు బ్రాండ్‌గా ఉండటం వల్ల అతడిని ఎవరు కూడా తప్పుగా అనుకునే వారు కాదు.మంచి సౌండ్‌ పార్టీ వ్యక్తి అయ్యి ఉంటాడని అంతా భావించి మోసపోయేవారు.దొంగతనాలకు రెక్కీ నిర్వహించే సమయంలో కూడా చాలా ప్లాన్డ్‌గా బ్రాండ్‌ డ్రస్‌లు వేసుకుని చాలా స్టైల్‌గా హుందాగా రోడ్డుపై నడుస్తూ వెళ్లేవాడు.

అతడిని అంతా చూసేవారు కాని అతడు ఒక దొంగ అయ్యి ఉంటాడని ఎవరు గుర్తించలేక పోయారు.

అలా చాలా ఇళ్లలో దొంగతనాలు చేశాడు.

ఇటీవల ఒక దొంగతనం చేస్తున్న సమయంలో సీసీ కెమెరాలో చిక్కి పోయాడు.సీసీ ఫుటేజ్‌ ఆధారంగా మెల్లగా అతడి వివరాలను సేకరించిన పోలీసులు ఇటీవలే అరెస్ట్‌ కూడా చేశారు.

అరెస్ట్‌ చేసిన పోలీసులు ఎంక్వౌరీ కోసం స్టేషన్‌కు తరలించారు.ఎంక్వౌరీలో తన బ్రాండ్‌ కథ మొత్తం చెప్పాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube