అదిరిపోయే ఫీచర్లతో ఆటోమేటిక్ కారు... రూ. 6 లక్షలలోపే సూపర్ కార్స్!

ఈ మధ్యకాలంలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కార్లపై వినియోగదారులకు మంచి మోజు పెరిగిందని చెప్పుకోవచ్చు.ఇలాంటి కార్లకు ఉన్న ప్రత్యేకత ఏమంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయాల్లో కూడా చాలా అనుకూలంగా మనం ప్రయాణించవచ్చు.

 Automatic Transmission Cars Under 6 Lakh Rupees With Special Features Details, A-TeluguStop.com

అందుకే మరీ ముఖ్యంగా పల్లెల్లో ఉండేవారి కంటే పట్టణాల్లో నివసించేవారు ఇలాంటి కార్లను కావాలని కోరుకుంటున్నారు.అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం ఏమంటే ఆటోమేటిక్ కార్ల ధరలు మాన్యువల్ కార్ల ధరల కంటే ఎక్కువగా ఉండడం.

అయినా చాలామంది పట్టుబట్టిమరీ అలాంటి కార్లైతేనే కొంటాం అని అన్నవాళ్ళు కూడా వున్నారు.అయితే డబ్బున్నవాళ్ళు అయితే పర్వాలేదు.కానీ ఎమౌంట్ విషయంలో కాస్త ఆలోచించేవారి పరిస్థితి ఏమిటి? వారికి కూడా ఓ దారి వుంది.అవును, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ కార్లను మనం సరసనమైన ధరలలోనే పొందవచ్చు.దాదాపుగా రూ.11 లక్షలకు పైగా ధర పలికే కార్లలో ఉండే ఫీచర్లు రూ.6 లక్షల కంటే తక్కువ ధరలో లభించే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కార్లలో వస్తున్నాయని మీలో ఎంతమందికి తెలుసు?

Telugu Lakhs, Automatic Cars, Cars, Renaultkwid, Presso Vxi Opt, Ups-Latest News

‘మారుతీ సుజుకి S-ప్రెస్సో’ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో ఇపుడు 2 వేరియంట్‌లు రూ.6 లక్షల కంటే తక్కువ ధరలలో అంటే S-Presso VXi Opt AT ఎక్స్-షోరూమ్ ధర రూ.5.65 లక్షలు, S-Presso VXi Plus Opt AT ఎక్స్-షోరూమ్ ధర రూ.5.99 లక్షలకే లభ్యం కానుంది.అలాగే ‘రెనాల్ట్ క్విడ్’ మోడల్ రెనాల్ట్ హ్యాచ్‌బ్యాక్ KWID 1.0 RXT AMT ఒక గొప్ప ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

Telugu Lakhs, Automatic Cars, Cars, Renaultkwid, Presso Vxi Opt, Ups-Latest News

ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.79 లక్షలు.అలాగే రెనాల్ట్ మరొక వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.99 లక్షలుగా వుంది.ఆ తరువాత చెప్పుకోదగ్గ కారు హ్యుందాయ్ శాంత్రో.శాంట్రో స్పోర్ట్స్ AMT వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.6 లక్షలు.ఇక్కడ పేర్కొన్న ఏ కారైనా మీరు నిరభ్యంతరంగా కొనొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఇక వీటిగురించి ఇంకా డిటైల్డ్ గా కావాలంటే ఆయా కంపెనీల వెబ్సైట్స్ సందర్శించగలరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube