కొట్టకుండానే మోగుతున్న గుడిలో గంట.. ఎలాగో తెలుసా..?

సాధారణంగా భక్తులు ఆలయానికి వెళ్ళినప్పుడు గంట కొట్టడం… వారికి ఇష్టమైన దైవాన్ని పూజించడం సర్వసాధారణం.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా అన్ని ప్రధాన ఆలయాల్లో మార్పులు చేయడం జరిగింది.

 Contactless Bell In Madhya Pradesh Temple, Censor-TeluguStop.com

దీంతో టెక్నాలజీని కూడా బాగా ఉపయోగించుకొని తగిన చర్యలు తీసుకుంటున్నారు.ఈ తరుణంలోనే మధ్యప్రదేశ్ లోని మందసార్ లోని ఒక పశుపతి నాద ఆలయం గురించి తెలుసుకోండి.

అన్ని ప్రధాన దేవాలయాల్లో లాగా అక్కడ కూడా మస్క్ లు, సోషల్ డిస్టెన్స్ తదితర నిబంధనలు పాటిస్తూ కండిషన్ లు పెట్టడం జరిగింది.భక్తులు వచ్చిన వారందరూ కూడా గంటను కొడతారు.

ఒకవేళ ఎవరైనా కరోనా సోకిన వారు కొడితే అతనివల్ల మరొకరికి కూడా వచ్చే ప్రమాదం ఉంది.ఇందుకోసం ఆ ఆలయం వారు సరికొత్త రీతిలో గంట కొట్టకుండానే గంట మోగేలా చేసే ఆలోచనతో ఒక సరికొత్త ఐడియా ను ఉపయోగించి… ఆలయంలో గంటకి ఒక ఆటోమేటిక్ సెన్సార్ ను ఏర్పాటు చేయడం జరిగింది.

ఇలా ఏర్పాటు చేయడం వల్ల గంట అదంతా కదే కొట్టుకుంటుంది.

ఇకపోతే ఆ గంటని ఎవరు ముట్టు కోవలసిన అవసరం కూడా లేదు.

ఆలయంలోకి భక్తులు గంట దగ్గరకు రాగానే దాన్ని సెన్సార్ గ్రహించి వెంటనే గంట మూడుసార్లు అదంతకు అదే మోగుతుంది.తద్వారా భక్తులకు ఎంతో ఆనందం కలిగిస్తూ ఉంది.

సాధారణంగా గుడిలో గంటకు ఒక ప్రధానమైన ప్రాధాన్యత కలిగి ఉంది.ఎప్పుడైనా గంట మోగించినప్పుడు ఓం అనే శబ్దం ఆలయం మొత్తం అనిపిస్తుంది.

కాబట్టి భక్తుల సెంటిమెంటును దృష్టిలో ఉంచుకొని ఆ ఆలయం వారు సెన్సార్ ఏర్పాటు చేయడం వల్ల భక్తులు వాళ్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.దేశంలో అన్ని ప్రధాన ఆలయాల్లో కూడా ఇలాంటివి ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube