ఆ ఆటో లో ఎంత మందంటే, పోలీసులే ఆశ్చర్యపోయారు!

ఇటీవల సోషల్ మీడియా పుణ్యమా అని వైరల్ న్యూస్ లకు కొదవే లేకుండా పోయింది.రోజుకొక న్యూస్ అయితే వైరల్ అవుతూ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి.

 Autodriver Warnedby Karimnagar Police For Overload-TeluguStop.com

అయితే ఇప్పుడు తాజాగా ఒక వీడియో వైరల్ గా మారింది.ఇంతకీ ఈ వీడియో షేర్ చేసింది ఎవరో కాదు కరీంనగర్ పోలీసులే.

వివరాల్లోకి వెళితే.కరీంనగర్ టౌన్ కు చెందిన అబ్దుల్ అనే ఆటో డ్రైవర్ ప్రయాణికులను ఎక్కించుకొని ఆటోలో తిమ్మాపూర్ వెళుతున్నాడు.

అయితే పరిమితికి మించిన ప్రయాణికులను ఎక్కించుకున్నట్లు భావించిన పోలీసులు మార్గ మధ్యలోనే ఆటోను నిలిపివేశారు.ఈ క్రమంలో అతడి పేరు వివరాలు తెలుసుకున్న పోలీసులు సమాచారం అడిగారు.

ఆటోలో ఎంతమందిని ఎక్కించుకోవాలి, ఇలా పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్న పోలీసులు ఆటోలో ప్రయాణికులను చూసి ఆశ్చర్యపోయారు.దీనితో మొత్తం ఆటోలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అని తెలుసుకొనేందుకు ఒక్కొక్కరిని కిందకు దింపగా అధికారులు దిగ్బ్రాంతి చెందారు.

ఎంత మంది ఉన్నారో తెలిస్తే మాత్రం నిజంగా అది ఆటోనా,లేక బస్సా అన్న సందేహం కలగక మానదు.నిజంగా ఆ ఆటోలో పిల్లా,పెద్ద కలిపి మొత్తం 24 మంది ప్రయాణిస్తున్నారు.

ఒక్కొక్కరుగా కిందకు దిగగా అధికారులు లెక్కించి ఆశ్చర్యపోయారు.ఈ తతంగాన్ని మొత్తం కూడా వీడియో తీశారు అధికారులు.

ఈ వీడియో ను కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా షేర్ చేయడం తో ఇప్పుడా వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.

ఆ ఆటో లో ఎంత మందంటే, పోలీసులే ఆ�

నిజంగా ఆ వీడియో చూసిన నెటిజన్లు అందరూ కూడా నిజంగా అది ఆటోనా లేక బస్సా అంతమంది ని ఎక్కించుకున్నాడు అంటూ మండిపడుతున్నారు.ఒక పక్క ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, మరోపక్క ప్రయాణికుల ప్రాణాలను గాలికొదిలేసి కేవలం డబ్బు కోసం ఆటో డ్రైవర్స్ చేస్తున్న ఇలాంటి చర్యల వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.అయినప్పటికీ వీరిలో మాత్రం ఎలాంటి మార్పు రావడంలేదు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube