వైరల్‌ వీడియో : ఆటో రన్నింగ్‌లో ఉండగా టైరు మార్చేశారు, ఎలా సాధ్యమో ఇక్కడ చూడండి  

Auto-rickshaw Tyre Changing Video Goes Viral-bizarre And Dangerous Act,changing An Auto Tyre,viral On Social Media

రేసింగ్‌లో పాల్గొనే కార్లు మరియు బైక్‌లు అక్కడక్కడ ఆపి టైర్లను మార్చుకోవాల్సి ఉంటుంది.అందుకోసం వారు 30 సెకన్ల నుండి 60 సెకన్ల వరకు వెయిట్‌ చేయాల్సి ఉంటుంది.అదే సమయంలో బండ్లో ఫ్యూయల్‌ కూడా ఫిల్‌ చేస్తారు.కాని ఈ ఆటోవాడు మాత్రం తన ఆటో ఆపకుండానే టైర్‌ను మార్చాడు.ఇది ఎక్కడ ఎప్పుడు జరిగిందో తెలియదు కాని ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

వైరల్‌ వీడియో : ఆటో రన్నింగ్‌లో ఉండగా టైరు మార్చేశారు, ఎలా సాధ్యమో ఇక్కడ చూడండి-Auto-rickshaw Tyre Changing Video Goes Viral-Bizarre And Dangerous Act Changing An Auto Viral On Social Media

కొందరు వీరు చేసిన పనిని అభినందిస్తుంటే మరి కొందరు మాత్రం వీరి పనిని విమర్శిస్తున్నారు.

వైరల్‌ వీడియో : ఆటో రన్నింగ్‌లో ఉండగా టైరు మార్చేశారు, ఎలా సాధ్యమో ఇక్కడ చూడండి-Auto-rickshaw Tyre Changing Video Goes Viral-Bizarre And Dangerous Act Changing An Auto Viral On Social Media

ఒక ఆటోకు మూడు టైర్స్‌ ఉంటాయి.ముందు టైర్‌ మరియు వెనుక వైపు ఎడమ టైరుపై ఆటోను నడుపుతూ కుడివైపు ఉన్న టైర్‌ పైకి లేపాడు.

అదే సమయంలో ఆటోలో ఉన్న ఇంకో సెకన్స్‌లో టైర్‌ను విప్పేయడం, మరో టైర్‌ను అందుకుని పెట్టేయడం నిమిషం లోపే జరిగి పోయింది.ఒక టైర్‌ను పైకి లేపేందుకు ఆటో డ్రైవర్‌ అటుఇటూ షేక్‌ చేసి ఒక్క సారి లేపాడు.

ఆ సమయంలో వెయికిల్స్‌ ఏమీ రాలేదు కనుక సరిపోయింది లేదంటే పరిస్థితి ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు.

నిన్న ఈ వీడియోను ట్విట్టర్‌లో హర్ష్‌ గోఎంక అనే వ్యక్తి ట్వీట్‌ చేశాడు.ఆ వీడియోను కొన్ని గంటల్లోనే లక్షల మంది చూశారు.ఆ వీడియోకు ఇప్పటి వరకు 3500 లైక్స్‌ మరియు 1100 కామెంట్స్‌ వచ్చాయి.ఎక్కువ శాతం ఆటోకు ఆపకుండా టైర్‌ మార్చడం అద్బుతమైన విన్యాసంగా కొనియాడుతున్నారు.అయితే ఇలాంటి స్టంట్స్‌ చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని, వారు చేసిన ప్రయత్నం అద్బుతం కాని, అలా అవసరం ఏముందని కొందరు ప్రశ్నిస్తున్నారు.

రోడ్డుపై ఆ సమయంలో మరో వెయికిల్‌ లేదా ఏదైనా అడ్డు వస్తే పరిస్థితి ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు.

మొత్తానికి ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.ఫార్ములా వన్‌ రేసర్లు కూడా టైర్‌ మార్చుకునేందుకు కొద్ది సమయం ఆగాల్సి ఉంటుంది.

కాని ఈ ఆటో వాలా మాత్రం ఒక్క సెకను కూడా ఆగకుండా టైర్‌ను మార్చడం నిజంగా అభినందనీయం అంటూ నెటిజన్స్‌ ఫిదా అవుతున్నారు.