శభాష్ : పెళ్లి కోసమని దాచుకున్న డబ్బుతో ఈ ఆటో డ్రైవర్ చేస్తున్న పనికి సలామ్ చేయాల్సిందే…  

Auto Driver Helping To The Food Less People In Lock Down Time - Telugu Akshay Food Helping, Auto Driver, Corona Virus, Food Less People, Lock Down Time, Pune

ప్రస్తుత కాలంలో పక్కన ఇంటి వాళ్ళు తిన్నారా.?, ఉన్నారా.? అని పట్టించుకునేవారే కరువయ్యారు.అలాంటిది ఇలాంటి కాలంలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా తిండి లేకుండా గడుపుతున్నటువంటి కుటుంబాలకు ఓ ఆటోడ్రైవర్ చేస్తున్నటువంటి సహాయం గురించి తెలిస్తే అతడికి సలామ్ చేయక మానరు.

 Auto Driver Helping To The Food Less People In Lock Down Time

పూణే పట్టణ పరిసర ప్రాంతంలో అక్షయ్ అనే ఓ యువకుడు నివాసం ఉంటున్నాడు.అయితే ఇతడు కుటుంబాన్ని పోషించుకునే పనిలో భాగంగా రోజూ ఆటో నడుపుతూ ఉండేవాడు.ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి ఓ యువతితో వివాహం కూడా అక్షయ్ కి నిశ్చయం అయింది.సరిగ్గా పెళ్లి జరిగే సమయంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఎంతో మంది వలస కార్మికులు మరియు పూటగడవని పేదలు తిండిలేక పస్తులు ఉంటున్నారు.

దీంతో వారిని చూసి చలించిపోయినటువంటి అక్షయ్ వెంటనే తన పెళ్లి కోసం దాచుకున్న  డబ్బుతో వారికి ఆహారాన్ని సమకూర్చాడు.ఇలా రోజు దాదాపుగా 400 మందికి పైగా అన్నదానం చేస్తున్నాడు.

శభాష్ : పెళ్లి కోసమని దాచుకున్న డబ్బుతో ఈ ఆటో డ్రైవర్ చేస్తున్న పనికి సలామ్ చేయాల్సిందే…-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అంతేగాక కొంత మంది నెటిజన్లు ఈ విషయాన్ని ఇతరులకు షేర్ చేస్తూ అక్షయ్ కి సహాయం చేయాలని కోరుతున్నారు.

అంతేగాక సహాయం చేయడానికి స్థోమత మరియు అర్హతలు వంటివి అవసరం లేదని కేవలం మంచి మనసుంటే చాలు అక్షయ్ నిరూపించాడు.  ప్రస్తుతం పక్క వాళ్ళ గురించే పట్టించుకునేవాళ్ళు లేని ఈ కాలంలో అక్షయ్ ఏకంగా తనతో ఎటువంటి సంబంధం లేని వాళ్ళ ఆకలి తీర్చడం నిజంగా అభినందించదగ్గ విషయం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Auto Driver Helping To The Food Less People In Lock Down Time Related Telugu News,Photos/Pics,Images..