హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్ ‌పై నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించిన అధికారులు.. !

నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ 130 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ‌లోని ట్యాంక్‌ బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.ఈ ప్రాంతం లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా లిబర్టీ జంక్షన్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వైపు వాహనాదారులు ఎవరూ రావద్దని ట్రాఫిక్‌ పోలీసులు సూచిస్తున్నారు.

 Authorities Impose Traffic Restrictions On Hyderabad Tank Bund Today Hyderabad,-TeluguStop.com

కాగా ఈ రోజు జరగనున్న ఈ కార్యక్రమం లో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కు ప్రముఖులు నివాళులర్పించే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియ చేస్తూ, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు.

ఇకపోతే ఇక్కడి ట్రాఫిక్ నిబంధలను చూస్తే.

అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి వచ్చే వాహనాలను తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ వైపు, బషీర్‌బాగ్ నుంచి వచ్చే వాహనాలను హిమాయత్‌ నగర్‌ వైపు మళ్లించనున్నారు.కాగా అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి వచ్చే వాహనాలకు లిబర్టీ వైపు అనుమతి లేదని ఈ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube