మోహన్ బాబుకు రూ. లక్ష జరిమానా విధించిన అధికారులు.. ఎందుకంటే.. ?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అనే పేరు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు.ఎందుకంటే పేరులోనే ఉందిగా కలెక్షన్ కింగ్ అని.

 Authorities Fined Mohan Babu, Hyderabad, Jubilee Hills, Actor Mohan Babu, Ghmc,-TeluguStop.com

దీంతోనే ఈయన పేరు అంతటా మోగిపోతుంది.

ఇకపోతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అనుమతి లేకుండా బోర్డు లు గానీ, ఫ్లెక్సీలు గానీ ఏర్పాటు చేసిన వారిపై కొరడా ఝుళిపించారు.

అందులో మోహన్ బాబు ఒకరు.ఎందుకంటే హైదరాబాద్ జూబ్లిహిల్స్‌ ఫిలింనగర్‌లో ఉన్న మోహన్ బాబు ఇంటి ముందు అడ్వర్‌టైజ్‌మెంట్ బోర్డు ఉందట.దీంతో ఆయనకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రూ.లక్ష జరిమానా విధించారు.

కాగా కలెక్షన్ కింగ్ ఇంటి ముందు సుమారు 15 అడుగుల ప్రకటన బోర్డును ఏర్పాటు చేసినందుకు ఎన్ ఫోర్స్ మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మెంట్ అధికారులు ఈ జరిమానా వేశారట.అదీగాక జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి రాతపూర్వక అనుమతి లేకుండా ప్రకటన బోర్డును ఏర్పాటు చేసినందుకు ఈ మేరకు జరిమానా విధిస్తున్నట్టు, జీహెచ్ఎంసీ అధికారులు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube