200 కేజీల ఐస్‌ముక్కల మధ్య రెండున్నర గంటలపాటు వ్యక్తి!

సాధారణంగా మనం చల్లదనం తగలగానే గజగజా వణికిపోతాం.ఐస్ ముక్కను కొంత సమయం పట్టుకోవాలంటే మన వల్ల కాదు.

 Austrian Man Spends 2.5 Hours In Box Filled With Ice Cubes, Frozen, The Sequel,-TeluguStop.com

అయితే ఒక మనిషి మాత్రం ఐస్ ముక్కల మధ్య రెండున్నర గంటల పాటు ఉన్నాడు.వినడానికి కొంత ఆశ్చర్యంగానే ఉన్నా నిజంగానే ఈ ఘటన చోటు చేసుకుంది.

రెండున్నర గంటల 57 సెకన్ల పాటు ఒక వ్యక్తి 200 ఐస్ ముక్కల మధ్య నిల్చొని ప్రపంచ రికార్డు సృష్టించాడు.

ఆస్ట్రియా దేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

జోసెఫ్ కోబెర్ల్ అనే వ్యక్తి ఈ అరుదైన రికార్డును సాధించాడు.జోసెఫ్ 200 కేజీల ఐస్ ముక్కను ఏకంగా భుజాల వరకు పోయించుకోవడం గమనార్హం.

నిన్న పొడవాటి గాజు బాక్సులో ఐస్ ముక్కలను వేసి దానిలొ జోసెఫ్ నిలబడి ఈ అరుదైన రికార్డును సాధించాడు.సాధారణంగా ఎవరికైనా కొంత సమయం ఐస్ గడ్డల మధ్య ఉంటే శరీరం గడ్డ కడుతుంది.

కానీ జోసెఫ్ మాత్రం శరీరం గడ్డ కడుతున్నా వెనక్కు తగ్గకుండా ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు.

అయితే తాను సాధించిన రికార్డు గురించి జోసెఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తన రికార్డును వచ్చే ఏడాది తానే బ్రేక్ చేస్తానని ప్రకటించాడు.లాస్ ఏంజిల్స్ నగరంలో వచ్చే ఏడాది జరగబోయే కార్యక్రమంలో ఈ రికార్డును తానే బ్రేక్ చేస్తానని జోసెఫ్ చెప్పాడు.జోసెఫ్ ఇలాంటి రికార్డులు సాధించడం ఇదే తొలిసారి కాదు.2019 సంవత్సరంలో కూడా జోసెఫ్ దాదాపు అరగంట పాటు ఐస్ గడ్డల మధ్య గడిపి రికార్డు సాధించడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube