ఆస్ట్రేలియా: విక్టోరియా రాష్ట్రంలో భారీగా కొత్త కేసులు... నేటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ చూసేందుకు ఆంక్షలు

ఆస్ట్రేలియాను కరోనా వైరస్ అల్లాడిస్తున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా డెల్టా వేరియంట్‌ కారణంగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

 Australias Victoria Logs Record Infections Ahead Of Key Sporting Event-TeluguStop.com

దీంతో కోవిడ్ చైన్‌ను బ్రేక్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం కఠినమైన లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది.ముఖ్యంగా దేశంలోనే పెద్ద నగరమైన సిడ్నీ, న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రాల్లో పరిస్ధితులు దారుణంగా వున్నాయి.

అలాగే విక్టోరియా రాష్ట్రం, మెల్‌బోర్న్‌లలో సైతం లాక్‌డౌన్ అమలవుతోంది.అయితే స్వేచ్ఛా ప్రియులైన ఆస్ట్రేలియన్లు నెలల తరబడి ఇళ్లలో మగ్గిపోవడానికి ఇష్టపడటం లేదు.

 Australias Victoria Logs Record Infections Ahead Of Key Sporting Event-ఆస్ట్రేలియా: విక్టోరియా రాష్ట్రంలో భారీగా కొత్త కేసులు… నేటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ చూసేందుకు ఆంక్షలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాలుగు గోడల మధ్య నలిగిపోలేక ఆస్ట్రేలియన్లు పలుమార్లు రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు.సిడ్నీ, కాన్‌బెర్రా, మెల్‌బోర్న్, బ్రిస్బేన్ వంటి నగరాల్లో రోజూ ఎక్కడో ఒక చోట లాక్‌డౌన్ ఎత్తివేయాలని నిరసనలు జరుగుతూనే వున్నాయి.

ఊహించని ఈ పరిణామంతో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేసేందుకు గాను ప్రభుత్వం సైన్యాన్ని మోహరించింది.

ఇప్పటి వరకు దేశంలోని న్యూసౌత్ వేల్స్ రాష్ట్రం, సిడ్నీ నగరం కోవిడ్‌‌కు హాట్ స్పాట్‌గా వున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ స్థానాన్ని విక్టోరియా రాష్ట్రం ఆక్రమించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది.గడిచిన కొన్ని రోజులుగా ఇక్కడ కేసులు పెరుగుతున్నాయి.తాజాగా శనివారం కొత్తగా 847 మంది కోవిడ్ బారినపడగా.ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

ఇక్కడ వ్యాప్తి తీవ్రత నవంబర్ వరకు వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.మరోవైపు ఆస్ట్రేలియాలో ప్రధానమైన స్పోర్ట్స్ ఈవెంట్‌గా చెప్పే .ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్‌బాల్ గ్రాండ్ ఫైనల్‌పై కేసుల ప్రభావం పడింది.శనివారం సాయంత్రం జరగనున్న ఈ మ్యాచ్‌కు హాజరవ్వాలని చాలా మంది టికెట్లు బుక్ చేసుకున్నారు.

అయితే విక్టోరియా రాష్ట్రంలో కేసులు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో రాష్ట్ర చీఫ్ హెల్త్ ఆఫీసర్ బ్రెట్ సుట్టన్ స్పందించారు.మీ స్నేహితులు, కుటుంబాలు ప్రమాదంలో పడకుండా వుండాలంటే అంతా ఇళ్లలోనే వుండాలని ఆయన ప్రజలకు సూచించారు.

మెల్‌బోర్న్‌కు చెందిన రెండు జట్లు మధ్య ప్రతిఏటా జరిగే ఈ మ్యాచ్ ప్రస్తుతం కరోనా తీవ్రత నేపథ్యంలో అధికారులు పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతానికి తరలించారు.మరోవైపు ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాలను సన్నిహితులు, కుటుబసభ్యులతో కలిసి చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఇళ్లలో గుమిగూడతారని అధికారులు ఆందోళన చెందుతున్నారు.మరోవైపు నిర్మాణ రంగ కార్మికులు కనీసం ఒక్క డోసైనా వేయించుకోవాలన్న నిబంధనపై ఆ వర్గం మండిపడుతున్న సంగతి తెలిసిందే.బుధవారం నుంచి మెల్‌బోర్న్‌ నగరంలో జరుగుతున్న ఈ నిరసనలు తాజాగా శివారు ప్రాంతాల్లోకి ప్రవేశించాయి.

ఈ క్రమంలో 30 మంది వరకు నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.అయితే గురువారం తెల్లవారుజామున ఈ నిరసనలో పాల్గొన్న ఓ వ్యక్తి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో ఆసుపత్రిలో చేరాడు.

దీంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది.ఇతని కారణంగా మరికొందరు వైరస్ బారినపడతారేమోనని ఆందోళన చెందుతున్నారు.

#Brett Sutton #Australia #COVID

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు