దేవుడా... ఆస్ట్రేలియా ప్రధాని పేరు మరిచిపోయిన బైడెన్, ఆడుకుంటున్న కంగారూలు

కొన్ని రోజుల కిందట అమెరికన్ మీడియా 2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలపై ఫోకస్ పెట్టింది.ఇంకా నాలుగేళ్ల సమయం వున్నప్పటికీ స్థానిక మీడియా దీని గురించి కథనాలు వెలువరించడం మొదలుపెట్టింది.

 Biden Appears To Forget Australian Pms Name, Says fellow Down Under, Joe Biden-TeluguStop.com

ఈసారి ఏకంగా అధ్యక్షుడు జో బైడెన్‌నే ‘‘ మీరు వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా’’ అంటూ అడిగింది.దీనికి అగ్రరాజ్యాధినేత సైతం చిరు నవ్వుతో సమాధానం చెప్పారు.

దీనికి కారణం లేకపోలేదు.78 ఏళ్ల వయసులో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బైడెన్.అగ్రరాజ్య చరిత్రలో అత్యంత పెద్ద వయస్కుడైన దేశాధినేతగా రికార్డుల్లోకెక్కారు.2024 నాటికి ఆయనకు 82 ఏళ్లు వస్తాయి.ఇప్పటికే వృద్ధాప్యం సహా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న బైడెన్.పూర్తి కాలం పదవీలో కొనసాగలేరనే కామెంట్లు వినిపిస్తున్నాయి.ప్రతిపక్ష రిపబ్లికన్లు ఆయన వయసుపై విమర్శలు చేస్తూనే వున్నారు.మొన్నామధ్య కమలా హారీస్‌ను ప్రెసిడెంట్ హ్యారీస్ అంటూ టంగ్ స్లిప్పయ్యారు.

అంతేకాదు మంత్రుల పేర్లు, వారి హోదాలను సైతం ఆయన చెప్పలేక తడబడ్డారు.ఆతర్వాత ఎయిర్‌ఫోర్స్ వన్ ఎక్కుతూ మూడు సార్లు కాలు జారి కిందపడిపోవడంతో డెమొక్రాట్లతో పాటు రిపబ్లికన్లలో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి.

తాజా బైడెన్ మరోసారి అభాసుపాలయ్యారు.

Telugu Australia, Bidenappears, China, Indo Pacific, Joe Biden, Kamala Harris, H

చైనా స్పీడుకు బ్రేక్ వేసే లక్ష్యంతో యూఎస్‌, బ్రిటన్, ఆస్ట్రేలియా మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరింది.ఈ మూడు దేశాలు కలిసి AUKUS కూటమిగా ఏర్పడ్డాయి.దీని కింద అణు జలాంతర్గాములను సమకూర్చుకునేందుకు ఆస్ట్రేలియాకు అమెరికా, బ్రిటన్ సహకారం అందించనున్నాయి.

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఒప్పందం జరిగింది.ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ.

మొదట యూకే ప్రధాని బోరిస్‌కు , తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని వైపు తిరిగి ఆయన పేరు గుర్తుకురాకపోవడంతో సహచరుడు అని అర్థం వచ్చేలా సంబోధించి, కృతజ్ఞతలు తెలియజేశారు.అదే సమయంలో ఆయన సంబోధించిన #ThatFellaDownUnder అనే పదం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

అయితే తమ ప్రధాని పేరు మర్చిపోవడంతో ఆస్ట్రేలియా ప్రజలు, మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.దీనిపై బైడెన్‌ను సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు కంగారూలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube