ఆర్ధిక వ్యవస్థకు బూస్టింగ్, ఆస్ట్రేలియా సర్కార్ కీలక నిర్ణయం.. ప్రత్యేక వీసాలకు రూపకల్పన

2019 చివరిలో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గడిచిన ఏడాదిన్నర కాలంలో కోట్లాది మంది ప్రజలు దీని బారినపడగా.

 Australias Special Visas To Foreign Talent To Help With Pandemic Recovery-TeluguStop.com

అదే స్థాయిలో మరణాలు సైతం సంభవించాయి.కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి తనకంటే ఎన్నో రెట్లు శక్తివంతుడైన మనిషిని నాలుగు గోడల మధ్య బందీని చేసింది.

నలుగురిలోకి వెళ్లాలంటే భయం.తోటి వ్యక్తి తుమ్మితే టెన్షన్.ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నం కాగా.లక్షలాది మంది రోడ్డునపడ్డారు.ఇలా ఒకటి కాదు.రెండు కాదు ఈ మహమ్మారి వల్ల ఎన్నో దారుణాలు.

 Australias Special Visas To Foreign Talent To Help With Pandemic Recovery-ఆర్ధిక వ్యవస్థకు బూస్టింగ్, ఆస్ట్రేలియా సర్కార్ కీలక నిర్ణయం.. ప్రత్యేక వీసాలకు రూపకల్పన-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

2020 చివరి నాటికి ఏవో కొన్ని దేశాలు తప్పించి.అంతగా వైరస్ ఉద్ధృతి లేకపోవడం అదే సమయంలో వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రావడంతో ఇక కోవిడ్ ముప్పు తప్పినట్లేనని అంతా భావించారు.

కానీ ఉత్పరివర్తనం చెంది .ఎన్నో రెట్లు శక్తిని పుంజుకుని మానవాళిపై దాడి చేయడం ప్రారంభించింది ఈ మహమ్మారి.వైరస్ విజృంభణ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై దాదాపు అన్ని దేశాలు ఆంక్షలు విధించాయి.అలాగే అప్పటికే వున్న విదేశీయులను పంపించివేయగా.కొత్తగా తమ దేశంలోకి రావాలనుకుంటున్న వలసదారులకు వీసాలు నిరాకరించాయి. అగ్రరాజ్యం అమెరికా సహా దాదాపు అన్ని దేశాలు వీసాలపై పరిమితి విధించాయి.

అత్యవసరం అనుకుంటునే ఆమోదముద్ర వేస్తున్నాయి.అయితే ప్రస్తుతం కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టడంతో కొన్ని కొన్ని దేశాలు వీసాల జారీపై ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రత్యేక వీసాలను తెరపైకి తీసుకొచ్చింది.కోవిడ్ వల్ల ఆర్ధిక వ్యవస్ధ పతనం కావడంతో తిరిగి కోలుకోవడానికి వీలుగా నైపుణ్యం, ప్రతిభ వున్న విదేశీ ఉద్యోగులకు వీసాలు మంజూరు చేయాలని స్కాట్ మోరిసన్ సర్కార్ భావిస్తోంది.దీని వల్ల వచ్చే 10 నెలల్లో వందలాది మంది విదేశీ కార్మికులు ఆస్ట్రేలియాకు రావొచ్చని అంచనా.

“Post Covid-19 Economic Recovery Event”గా పిలుస్తున్న ఈ ప్రత్యేక వీసాల వల్ల ఆస్ట్రేలియాలో వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్న వ్యూహం.మార్చి 2021లో వెలుగుచూసిన కోవిడ్ వల్ల కొన్ని కీలక పరిశ్రమలు, సేవలలో నైపుణ్యాల కొరత తీవ్రమైంది.ఇదే సమయంలో వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆస్ట్రేలియా పౌరులు కాని వారిని, సొంతపౌరులను సైతం దేశంలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు ప్రధాని స్కాట్ మోరిసన్.

కాగా, జూలై చివరి నాటికి దాదాపు 38000 మంది ఆస్ట్రేలియన్లు విదేశాలలో చిక్కుకుపోయారని అంచనా.

Telugu Australia, Australias Special Visas To Foreign Talent To Help With Pandemic Recovery, Corona Second Wave, Government Of Australia, Post Covid-19 Economic Recovery Event, Prime Minister Scott Morrison-Telugu NRI

కాగా, భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా మనదేశం నుంచి వచ్చే విమానాలు, ప్రయాణికులపై ఆయా దేశాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.కానీ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ మాత్రం కాస్తంత ఓవరాక్షన్ చేశారు.భారత్ నుంచి వచ్చేవారితో పాటు సొంత పౌరులపైనా ఆయన బ్యాన్ విధించారు.ఇండియాలో 14 రోజుల పాటు ఉన్న ఆస్ట్రేలియా పౌరులు నిబంధనలను అతిక్రమించి స్వదేశంలోకి అడుగు పెడితే ఐదేళ్ల జైలుశిక్ష, రూ.49 లక్షల వరకు జరినామా విధిస్తామని మోరిసన్ హెచ్చరించారు.అయితే ప్రధాని నిర్ణయంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి

.

#Australia #PrimeScott #Corona Wave #Australia #CovidEconomic

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు