సముద్రం లోపల హోటల్... సొరచేపలతో కలిసి సేదతీరొచ్చు  

Australia\'s First Underwater Accommodation Is Officially Open-officially Open,queensland,sea

ప్రపంచం మారుతున్న కొద్ది ప్రజల ఆలోచనలలో కూడా మార్పులు వస్తున్నాయి.సరికొత్తగా ఆలోచిస్తూ కొత్త కొత్త అనుభూతిని అందించే విధంగా హోటల్స్ తో పాటు అనేక రకాల వింతలు రూపొందిస్తున్నారు.

Australia\'s First Underwater Accommodation Is Officially Open-officially Open,queensland,sea తెలుగు అవి ఇవి వింత తెలియని వాస్తవాలను మిస్టరీ విశేషాలు -Australia's First Underwater Accommodation Is Officially Open-Officially Open Queensland Sea

తనని తాను ఆనంధపరుచుకోవడం కోసం, అలాగే ప్రజలని ఆకర్షించడం కోసం కొత్త కొత్త ఆలోచనలకి తెరతీస్తూ అందరిని మెప్పిస్తున్నారు.సరికొత్త అనుభూతిని అందించడానికి కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి కొన్ని క్రియేటివిటీకి పదును పెట్టి అనేక నిర్మాణాలు చేపడుతున్నారు.

పర్వతాల మధ్య హోటల్స్, అలాగే నీటిలో తేలే రెస్టారెంట్ లు, ఎత్తైన ప్రదేశాలలో నిర్మాణాలు చేస్తున్నారు.ఇప్పుడు అలాంటి ఓ వింతైన హోటల్ నిర్మాణంని ఆస్ట్రేలియా దేశంలో క్వీన్ లాండ్ రాష్ట్రం చేపట్టింది.

సముద్రపు అడుగున జలచరాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేయాలనుకునే వారు కోసం హోటల్ ని నిర్మించింది.ఆస్ట్రేలియాలో తొలి అండర్ వాటర్ హోటల్ ని ప్రారంభించారు ఈ హోటల్ కోసం ఏకంగా 72 కోట్లు ఖర్చు చేసారు.

పర్యవరణంలో వస్తున్న మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ హోటల్ నిర్మించినట్లు అక్కడి అధికారులు తెలిపారు.ఏర్లీ బీచ్‌కు దాదాపు 73 కిలోమీటర్ల దూరంలో సముద్రం అడుగున 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ హోటల్‌ను నిర్మించారు.

ఇందులో పది పడకగదులను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేయగా.తొలి రెండు డిసెంబర్ 1న ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

ఈ హోటల్ లో స్టే చేయడానికి అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం కల్పించారు.త్వరలో పర్యాటకుల కోసం దీనిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

.

తాజా వార్తలు