రచయిత, బ్రాడ్‌కాస్టర్ క్లైవ్ జేమ్స్ కన్నుమూత

ఆస్ట్రేలియాకు చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత, బ్రాడ్‌కాస్టర్ క్లైవ్ జేమ్స్ కన్నుమూశారు.ఆయన వయస్సు 80 సంవత్సరాలు.గత కొంతకాలంగా లుకేమియా వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆదివారం కేంబ్రిడ్జ్‌లోని తన నివాసంలో మరణించారు.

 Australian Writer Broadcaster Tv Critic Clive James-TeluguStop.com

1939లో ఆస్ట్రేలియాలోని కొగరాలో జన్మించిన ఆయన పూర్తి పేరు వివియన్ జేమ్స్ … 1961లో ఆస్ట్రేలియా నుంచి ఇంగ్లాండ్‌కు మకాం మార్చిన జేమ్స్ అక్కడ సాహిత్య విమర్శకునిగా, టీవీ కాలమిస్ట్‌గా ప్రాచుర్యం పొందారు.ఇదే సమయంలో జపనీస్ గేమ్ షో ఎండ్యూరెన్స్ వినోదభరితంగా సాగే ఆఫ్ బీట్ టీవీ షోలను పరిచయం చేశారు.

క్లైవ్ జేమ్స్ ఆన్ టెలివిజన్ వంటి ప్రదర్శనలలో ఇంటర్నేషనల్ ప్రోగ్రామింగ్‌పై వ్యంగ్యంగా వ్యాఖ్యానం చేస్తూ ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.2010లో జేమ్స్‌ లుకేమియాతో బాధపడుతున్నట్లు తేలింది.ఆయన తన చురుకైన వ్యాఖ్యానాలతో అనేకసార్లు వివాదాలకు కారణమయ్యాడు.

ఈ క్రమంలో ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్‌ను ‘‘వాల్‌నట్స్‌తో నిండిన గోధుమ కండోమ్‌’’తో పోల్చాడు.అలాగే మోటారు రేసింగ్ కామెంటేటర్ ముర్రే వాకర్‌ను మండుతున్న ప్యాంట్ ధరించిన వ్యక్తిగా అభివర్ణించాడు.

కాగా.కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని పెంబ్రోక్ కాలేజీలోని ప్రార్థనా మందిరం వద్ద కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో బుధవారం జేమ్స్ అంత్యక్రియలు ముగిశాయి.

ఈ ప్రదేశం అతనికి ప్రత్యేకమైనది….ఎందుకంటే ఆయన ఇక్కడే ఇంగ్లీష్ లిటరేచర్‌పై చదువుకున్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube