గడగడలాడిస్తున్న డెల్టా.. నత్తనడకన వ్యాక్సినేషన్, ప్రజలకు ఆస్ట్రేలియా ప్రధాని క్షమాపణలు

కరోనా వైరస్‌ వ్యాప్తిని సమర్థవంతంగా కట్టడి చేసిన దేశాల్లో ఆస్ట్రేలియా కూడా ఒకటి.అందుకే అక్కడ కేసులు, మరణాల తీవ్రత అంతగా లేదు.

 Australian Pm Scott Morrison Says sorry For Slow Vaccine Rollout As Covid Cases-TeluguStop.com

పకడ్బందీ వ్యూహాం, పరీక్షలు, అనుమానితుల గుర్తింపు వంటి చర్యలతో పాటు లాక్‌డౌన్ కారణంగా కరోనా ఆస్ట్రేలియన్లను అంతగా ఇబ్బంది పెట్టలేదు.కానీ ఆదే ఆసీస్‌ను ‘‘డెల్టా వేరియంట్’’ ముప్పు తిప్పలు పెడుతోంది.

దీంతో అప్రమత్తమైన ఆస్ట్రేలియా.ప్రధాన నగరాల్లో మరోసారి లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలు చేస్తోంది.

ఆస్ట్రేలియాలో దాదాపు కోటికిపైగా ప్రజలు నాలుగు గోడలకే పరిమితమయ్యారు.వీటికితోడు దేశంలో వ్యాక్సిన్‌ పంపిణీ మందకొడిగా సాగుతోంది.

ఇప్పటి వరకు కేవలం 11 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్‌ అందించినట్లు సమాచారం.

ఆస్ట్రేలియా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పైనే ఎక్కువ‌గా ఆధార‌ప‌డింది.

అయితే దీని కార‌ణంగా ర‌క్తం గ‌డ్డ క‌డుతుండ‌టంతో ప్ర‌స్తుతం కేవ‌లం 60 ఏళ్లు నిండిన వారికే దీనిని వేస్తున్నారు.ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌నే ఎక్కువ‌గా న‌మ్ముకోవ‌డంపై అక్క‌డి ఆరోగ్య అధికారులు కూడా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

వ్యాక్సిన్‌ పంపిణీపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న ఆస్ట్రేలియన్లు.ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు.

ఇలా ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో.దేశ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.

వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంపై పూర్తి బాధ్య‌త నాదేనన్న మారిసన్.మ‌న ముందున్న స‌వాళ్ల‌కు కూడా తనదే బాధ్య‌త‌ అని చెప్పారు.

కాగా, నెల రోజులుగా సిడ్నీ నగరం లాక్‌డౌన్‌లోనే ఉన్నా కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.తాజాగా న్యూసౌత్ వేల్స్‌ రాష్ట్రంలో తాజాగా 124 కేసులు న‌మోద‌య్యాయి.

Telugu Australia, Australianpm, Delta, Melbourne, Wales, Primescott-Telugu NRI

మరోవైపు కరోనా బారినపడి ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన ఓ వృద్ధుడికి సంబంధించి మెల్‌బోర్న్‌లోని వృద్ధుల శరణాలయంలో అధికారులు హై అలర్ట్ హెచ్చరికను జారీ చేశారు.హాప్పర్స్ క్రాసింగ్‌లోని మెక్‌వాకేర్ జాన్ అట్చిసన్ సెంటర్‌కు గురువారం ఉదయం వచ్చిన వ్యక్తికి కోవిడ్ వుండే అవకాశాలు వున్నట్లు తెలియజేశారు.దీంతో అతనికి మరోసారి పరీక్షలు నిర్వహించిన అధికారులు కోవిడ్ రిజల్ట్ కోసం వేచిచూస్తున్నారు.ముందు జాగ్రత్త చర్యగా అక్కడే వుండే వారు, సిబ్బందిని ఐసోలేషన్‌కు తరలించడంతో పాటు పీపీఈ కిట్లు ధరింపజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube