వైరల్‌ : కార్చిచ్చు బాధితులను ఆదుకునేందుకు ఈమె నగ్నంగా ఏం చేసిందో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా కన్నీరు పెట్టిస్తున్న ఆస్ట్రేలియా కార్చిచ్చును అక్కడి ప్రభుత్వాలు అదుపులోకి తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.దేశ వ్యాప్తంగా అధికారగణం అదే పనిలో ఉన్నా కూడా ఆ కార్చిచ్చు మాత్రం ఆగడం లేదు.

 Australian Model Kaylen Ward Dress Less-TeluguStop.com

పెద్ద మొత్తంలో జంతువులు నష్టం జరుగుతుంది.అధికారిక లెక్కల ప్రకారం 50 కోట్ల జీవరాశులు మృతి చెంది ఉంటాయి అంటున్నారు.

ఇక ఇప్పటికే పాతిక మంది వరకు మనుషులు కూడా చనిపోయారని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది.కార్చిచ్చును అదుపులోకి తీసుకు వచ్చేందుకు ఒక వైపు ప్రయత్నాలు జరుగుతుంటే మరో వైపు నిరాశ్రయులను ఆదుకునేందుకు మరో వైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Telugu Australian, Kaylen Ward, Telugu Ups-General-Telugu

కార్చిచ్చు బాధితులను ఎవరికి వీలున్నట్లుగా వారు ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు.తాజాగా ఒక మోడల్‌ అయిన 20 ఏళ్ల కైలెన్‌ వార్డ్‌ అనే యువతి బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది.అయితే తన వద్ద ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆమె వినూత్నంగా ప్రయత్నించాలని నిర్ణయించుకుంది.అందుకే సోషల్‌ మీడియా ద్వారా తన ప్లాన్‌ను అమలు చేసింది.కార్చిచ్చు బాధితుల కోసం మీరు 10 డాలర్ల నుండి ఆ పై ఎంతైనా సాయం చేయండి.మీ సాయంకు ప్రతిఫలంగా నేను నా న్యూడ్‌ ఫొటోలను మీతో షేర్‌ చేసుకుంటాను అంటూ పోస్ట్‌ పెట్టింది.

Telugu Australian, Kaylen Ward, Telugu Ups-General-Telugu

ఆమె పోస్ట్‌కు అనూహ్య స్పందన వచ్చింది.ఆమె ఈ ప్రకటన చేసిన మూడు నాలుగు రోజుల్లోనే ఏకంగా లక్ష డాలర్ల వరకు విరాళం వచ్చింది.ఆమె అన్నట్లుగానే సోషల్‌ మీడియాలో తన న్యూడ్‌ ఫొటోలను పోస్ట్‌ చేసింది.అయితే ఈ విషయంపై ఇన్‌స్టాగ్రామ్‌ సీరియస్‌ అయ్యింది.న్యూడ్‌ ఫొటోలు పెట్టడంతో పాటు విరాళం సేకరించేందుకు ఇన్‌ స్టాను వేదికగా చేసుకోవడం తమ రూల్స్‌కు విరుద్దం అంటూ ఆమె పేజీను తొలగించడం జరిగింది.అయినా కూడా మరో ఫ్లాట్‌ ఫామ్‌పైన ఆమె తన విరాళాల సేకరణ చేస్తోంది.10 లక్షల డాలర్ల విరాళం సేకరించాలనేది తన లక్ష్యం అంటూ ఈ అమ్మడు చెప్పుకొస్తుంది.విరాళం సేకరించడం అనేది మంచి పని.కానీ ఇలా సేకరించడం ఏంటి అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube