జెర్సీ సినిమాపై ప్రశంసలు కురిపించిన ప్రముఖ జర్నలిస్ట్

నేచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్నునూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జెర్సీ.కొడుకు కోసం వదిలేసిన క్రికెట్ ని మళ్ళీ మొదలు పెట్టి ప్రాణాలని వదిలేసిన ఓ ఆటగాడి కథతో ఈ మూవీ తెరకెక్కింది.

 Australian Journalist  Amanda Bailey Praise Jersey Movie, Natural Star Nani, Tol-TeluguStop.com

ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రసంసలని సైతం సొంతం చేసుకుంది.నాని కెరియర్ లో బెస్ట్ మూవీలలో ఒకటిగా నిలిచిపోయే ఈ మూవీని ప్రస్తుతం అల్లు అరవింద్, దిల్ రాజు సంయుక్తంగా హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేశారు.

ఒరిజినల్ తెరకెక్కించిన గౌతమ్ దర్శకత్వంలోనే హిందీ రీమేక్ కూడా తెరకెక్కింది.ఇక రీసెంట్ గా ఈ మూవీ నేషనల్ అవార్డ్స్ ని కూడా రెండు విభాగాలలో సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే ఈ మూవీకి దేశ వ్యాప్తంగా చాలా మంది క్రిటిక్స్ నుంచి ప్రసంశలు లభించాయి.ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాకి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ అమండా బైలీ జెర్సీ సినిమాని వీక్షించిన తర్వాత తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో వెల్లడించారు.

నేను జెర్సీ సినిమా చూసాను.ఈ సినిమా ఒక అద్బుతమైన ఎమోషనల్ జర్నీ, అర్జున్ తన కలని సాకారం చేసుకునే దృశ్యాన్ని మేకర్స్ అద్బుతంగా ఆవిష్కరించారు.

హీరో నాని అద్బుతంగా నటించారు.మీరు అతనితో నవ్వుతారు, అతనితో ఏడుస్తారు.ఈ సినిమాలో నా ఫేవరేట్ సీన్ ట్రైన్ ఎపిసోడ్ అని అమండా తన పోస్ట్ లో చెప్పుకొచ్చారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.

భాష కూడా తెలియని ఓవ్యక్తి జెర్సీ మూవీ గురించి ఇలా కామెంట్స్ చేయడం ద్వారా మంచి కథని చెప్పడానికి, అలాగే కథలో ఎమోషన్స్ ని ప్రెజెంట్ చేయడానికి బాష అవసరం లేదనే జెర్సీ మూవీ ప్రూవ్ చేసినట్లు అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube