ఇండియాను ఆదుకునేందుకు తన పెద్ద మనసును చాటుకున్న ఫారెన్ ప్లేయర్..!

ఇండియాలో కొద్ది వారాలుగా కరోనావైరస్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.ఆక్సిజన్ కొరతతో చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు.

 Australian Fast Bowler Pat Cummins Donated Fifty Thousand Dollars To Pm Cares,-TeluguStop.com

బెడ్లు ఖాళీ లేక కొందరు రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు.ఇంకొందరు ఇంట్లోనే చనిపోతున్నారు.

సరైన వైద్య వసతులు లేక ఇండియా అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది.ఇటువంటి తరుణంలో భారత్ కు సాయం చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు.

కరోనాతో విలవిల్లాడుతున్న ఇండియాకు సంఘీభావాన్ని తెలుపుతూ, ఆదుకునేందుకు 40 టాప్ అమెరికన్ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో ఓ గ్లోబల్ టాస్క్ ఫోర్స్ ఏర్పడింది.యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ నేతృత్వంలోని యూఎస్ – ఇండియా బిజినెస్ కౌన్సిల్, యూఎస్ – ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్టనర్ షిప్ ఫోరమ్ ల ఆధ్వర్యంలో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పడింది.

ప్రముఖ సంస్థలు భారత్ కు తమ వంతు సాయాన్ని ప్రకటిస్తూనే ఉన్నాయి.ఇటువంటి తరుణంలో క్రీడాకారులు కూడా తమకు తోచిన సాయాన్ని భారత్ కు అందిస్తున్నారు.

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ 50 వేల డాలర్లను పీఎం కేర్స్‌ ఫండ్‌కు అందించారు.మిగతా ఐపీఎల్‌ సభ్యులు కూడా సాయం అందించాలని కోరారు.

భారత దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది.చాలా మంది సకాలంలో ఆక్సిజన్ అందక చనిపోవడం అందర్నీ కలచివేస్తోంది.ఇటువంటి క్రమంలో భారత్‌కు సాయం చేసేందుకు లండన్ ముందుకొచ్చింది.600కు పైగా ఆక్సిజన్‌ కాన్సెట్రేటర్లు, వెంటీలేటర్లు, ఇతర మెడికల్ పరికరాలు పంపింది.అంతేకాకుండా చాలా మంది తమ సాయాన్ని ప్రకటిస్తున్నారు.క్రీడాకారులు కూడా తమ వంతు సహాయాన్ని అందజేస్తున్నారు.భారత్ ఐపిఎల్ జరుగుతున్న నేపథ్యంలో క్రీడాకారులు స్పందిస్తున్నారు.ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ తాను చేసిన సాయాన్ని ఆక్సిజన్ సామాగ్రిని కొనుగోలు చేసే క్రమంలో ఉపయోగించాలని కోరారు.

లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇండ్లల్లో ఇబ్బందులు పడకుండా ఐపిఎల్ కొంత మేరకు వినోదాన్ని అందిస్తోందని తెలిపారు.ప్రజలు ఇంట్లోనే ఉండి కరోనాతో పోరాడాలని కమిన్స్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube