మందు తాగి ఇంటికి వస్తే డిప్ప పై తన భార్య ఒక్కటిచ్చేదంటున్న స్టార్ క్రికెటర్..  

Interesting News About Australian Cricketer David Warner - Telugu Australian Cricketer David Warner, Candie, David Warner, Telugu Viral News Updates, Viral In Social Media, డేవిడ్ వార్నర్

ఫార్మెట్ ఏదైనా సరే తన హవాని కొనసాగిస్తూ ఎటువంటి బౌలర్ నైనా తన విధ్వంసకర బ్యాటింగ్ తో హడలెత్తించే ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ గురించి తెలియని వారు ఉండరు.అయితే డేవిడ్ వార్నర్ కి ఆస్ట్రేలియా దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ అభిమానులు ఉన్నారు.

Interesting News About Australian Cricketer David Warner - Telugu Candie Viral Updates In Social Media డేవిడ్ వార్నర్

అయితే తాజాగా డేవిడ్ వార్నర్ ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.ఇందులో భాగంగా తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు.

అయితే తన భార్య క్యాండీస్ తన జీవితంలోకి రాకముందు తనకు 2 చెడ్డ అలవాట్లు ఉండేవని అన్నాడు.ఇందులో తన పెళ్లి కాక ముందు అలవాటు అయినటువంటి మద్యపానం తన పెళ్లయిన తర్వాత కూడా కొద్ది రోజులు కొనసాగించానని, కానీ తాను మందు తాగడం తన భార్య క్యాండీస్ కి అసలు నచ్చేది కాదని అన్నారు.

అంతేగాక ఈ విషయాన్ని క్యాండీస్ తనతో సున్నితంగా చెప్పినప్పటికీ అసలు వినేవాడిని కాదని కూడా అన్నారు.దీంతో విసిగిపోయినటువంటి క్యాండీస్ తాను మద్యం సేవించి ఇంటికి వచ్చినప్పుడల్లా తలపై కొట్టేదని అంతేగాక ఎందుకు ఇలా మద్యం తాగుతూ కెరియర్ ని, అందమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావ్ అంటూ ప్రశ్నించే దట.దీంతో ఒకానొక రోజున క్యాండీస్ మాటలకురియలైజ్ అయినటువంటి డేవిడ్ వార్నర్ మద్యపానాన్ని పూర్తిగా మానేసాడట.

అయితే డేవిడ్ వార్నర్ కి ఉన్నటువంటి చెడ్డ అలవాట్ల లో క్యాండిల్ ని తిప్పి రెండువైపులా అంటించడం ఒకటి.అయితే మొదట్లో డేవిడ్ వార్నర్ ఎప్పుడు క్యాండిల్ వెలిగించాలన్నా రెండు వైపులా తిప్పి వెలిగించే వాడట.ఈ అలవాటుని కూడా తన భార్య క్యాండీస్ బలవంతంగా మన్పించిందని చెప్పుకొచ్చాడు.

అంతేకాక జీవితంలో మనకంటూ ఒక భాగస్వామి వచ్చినప్పుడు మనజీవన శైలిలో మార్పు వస్తుందని అనుకోకుండానే ప్రేమాభిమానాలకి బానిసలు అవుతామని చెప్పుకొచ్చాడు డేవిడ్ వార్నర్.

తాజా వార్తలు

Interesting News About Australian Cricketer David Warner-candie,david Warner,telugu Viral News Updates,viral In Social Media,డేవిడ్ వార్నర్ Telugu Viral News Related Telugu News,Photos/Pics,Images..