కార్చిచ్చులో సర్వం కోల్పోయాడు... మళ్ళీ కోటీశ్వరుడు అయ్యాడు  

Australian Bushfires Victim Has Become An Instant Millionaire - Telugu Australian Bushfires Victim, Instant Millionaire,

దురదృష్టం కోటీశ్వరుడుని బికారిగా మార్చేస్తుంది.అదే అదృష్టం బికారిని కూడా కోటీశ్వరుడుని చేసేస్తుంది.

Australian Bushfires Victim Has Become An Instant Millionaire

ఎవరికి, ఎప్పుడు, ఎలా అదృష్టం కలిసి వస్తుందో ఎవరు చెప్పలేరు.దురదృష్టవంతుడుని అని భావించిన వాడికి కూడా ఏదో ఒక రూపంలో అదృష్టం కలిసి వచ్చి కోటీశ్వరుడు అయిపోవచ్చు.

చాలా మంది ఇలా తమ జీవితంలో బికారి స్థాయి నుంచి కోటీశ్వరుడుగా మారిపోయారు.ఇప్పుడు అలాంటి సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.

ఆస్ట్రేలియాలో అడవులలో ఎగసిన కార్చిచ్చు కారణంగా కొన్ని కోట్ల జీవరాశులు చనిపోయాయి.లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులుగా మారిపోయారు.

ఆస్తులని పోగొట్టుకొని రోడ్డున పడ్డారు.

అడిలైడ్ కార్చిచ్చు కారణంగా ఓ వ్యక్తి సర్వం కోల్పోయాడు.

సొంత ఇల్లు, సంపాదించుకున్న ఆస్తి అంతా కూడా అగ్నికి ఆహుతి అయిపొయింది.కట్టుబట్టలతో రోడ్డున పడ్డాడు.

ఇక కొత్త జీవితాన్ని ఎలా మొదలెట్టాలో తెలియక తన దురదృష్టంకి తానే బాధపడుతున్నాడు.అయితే అతనికి ఊహించని విధంగా లాటరీ రూపంలో అదృష్టం కలిసి వచ్చింది.

కొత్త జీవితం మొదలెట్టె క్రమంలో ఓ లాటరీ టికెట్ కొన్నాడు.అయితే ఆ లాటరీ టికెట్ కి ఊహించని విధంగా ఫ్రైజ్ మనీ వచ్చింది.

అది కూడా ఏకంగా ఏడుకోట్ల 14 లక్షలు.ఇంత పెద్ద మొత్తంలో లాటరీ రావడంతో ఇప్పుడు అతని ఆనందానికి అవధులు లేవు.

కార్చిచ్చు ఉన్న ఇంటికి కాల్చేసిన భగవంతుడు తనకి ఇలా దారి చూపించాడని అతను పండగ చేసుకుంటున్నాడు.

.

తాజా వార్తలు

Australian Bushfires Victim Has Become An Instant Millionaire-instant Millionaire, Related....