రేప్ చేశారని చెబితే.. నా తండ్రి మౌనంగా ఉండమన్నాడు: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కుమార్తె

కన్నకూతురిపై అఘాయిత్యం జరిగితే ఏ తండ్రి అయినా సరే తల్లడిల్లిపోతాడు.తన బిడ్డ జీవితాన్ని నాశనం చేసిన వాడి అంతు చూసేదాకా వదలడు.

 Australian Bobhawke Daughter-TeluguStop.com

కానీ ఏకంగా దేశ ప్రధాని హోదాలో ఉన్న ఓ వ్యక్తి మాత్రం కూతురిపై అత్యాచారం జరిగిన విషయాన్ని దాచిపెట్టాడు.

వివరాల్లోకి వెళితే.

ఆస్ట్రేలియా మాజీ ప్రధాని బాబ్ హాక్ కుమార్తె రోస్లిన్ డిల్లాన్ 1980లలో తనపై అత్యాచారం జరిగిందని.అయితే రాజకీయ భవిష్యత్తు కోసం ఈ విషయంలో మౌనంగా ఉండాల్సిందిగా కోరారని ఆరోపించారు.

ఇందుకు సంబంధించి న్యూ డైలీ వెబ్‌సైట్‌ కథనాలు ప్రచురించింది.తన తండ్రికి చెందిన లేబర్ పార్టీ ఎంపీ బిల్ లాండెరియు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది.

Telugu Bob Hawke, Telugu Nri Ups-

లాండెరియో కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు అతను తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అదే సమయంలో తన తండ్రి హాక్ లేబర్ పార్టీ నాయకుడిగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.అంతేకాకుండా 1983లో ఆమె మూడు సార్లు లైంగిక వేధింపులకు గురైయ్యారట.మూడవసారి అత్యాచారం జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేద్దామని అనుకున్నానని, కానీ తన తండ్రి ప్రస్తుతం తాను ఎలాంటి వివాదాల్లో లేనని.నువ్వు పోలీస్ స్టేషన్‌కు వెళితే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పినట్లు ఆరోపిస్తున్నారు.

Telugu Bob Hawke, Telugu Nri Ups-

దీనిపై డిల్లాన్ సోదరి స్యూ పీటర్స్ హాక్ స్పందిస్తూ… ఈ ఆరోపణల గురించి తమ కుటుంబానికి తెలుసునన్నారు.మాజీ యూనియన్ అధికారి మాట్లాడుతూ.లాండెరియు 1976-1992 వరకు ఎంపీగా పనిచేశారని, అంతేకాకుండా హాక్‌కు అతనితో సన్నిహిత సంబంధాలు ఉండేవని తెలిపారు.1980వ దశకంలో ఆస్ట్రేలియా రాజకీయాల్లో హాక్ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచారు.అప్పట్లో నాలుగు సాధారణ ఎన్నికల్లో ఆయన గెలిచారు.ప్రధానిగా దేశంలో ఆర్ధిక, సామాజిక మార్పులకు శ్రీకారం చుట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube