కాళ్లకు రూ.7 కోట్ల ఇన్సూరెన్స్ చేయించిన సారా.. ఎందుకంటే..?

సాధారణంగా మనుషులకు, వాహనాలను ఇన్సూరెన్స్ చేయిస్తామనే సంగతి తెలిసిందే.అయితే మిస్ వరల్డ్ సారా మాత్రం ఏకంగా తన కాళ్లకు ఇన్సూరెన్స్ చేయించుకుంది.

 Australian Beauty Queen Insured Her Legs For 1 Million Dollars-TeluguStop.com

ఇన్సూరెన్స్ చేయించుకోవడం కోసం సారా ఏకంగా 7 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం గమనార్హం.పొడుగు కాళ్ల సుందరిగా పేరు తెచ్చుకున్న సారా 2019 సంవత్సరంలో మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా కిరీటంను సొంతం చేసుకున్నారు.

22 సంవత్సరాల వయస్సులోనే సారా మిస్ వరల్డ్ కిరీటంను గెలుచుకున్నారు.ఈమె ఆస్ట్రేలియాలోని బుండాబర్గ్ ప్రాంతానికి చెందినవారు.

 Australian Beauty Queen Insured Her Legs For 1 Million Dollars-కాళ్లకు రూ.7 కోట్ల ఇన్సూరెన్స్ చేయించిన సారా.. ఎందుకంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన అందానికి కారణం కాళ్లే అని ఆ కాళ్ల వల్లే తాను అందాల పోటీల్లో గెలిచానని సారా భావిస్తున్నారు.ఆ కారణం వల్లే సారా తన కాళ్లకు ఇన్సూరెన్స్ చేయించారు.

ఆమె కుటుంబ సభ్యులలో చాలామంది రగ్బీ ఆటగాళ్లు కాగా సారా మాత్రం ఫుట్ బాల్ ను ఎక్కువగా ఇష్టపడతారు.

సారా పూర్తి పేరు సారా మార్ష్కే కాగా అతి త్వరలో జరగబోయే ఫుట్ బాల్ కు సంబంధించిన ఉమెన్స్ లీగ్ పోటీలలో ఆమె పాల్గొనబోతున్నారు.

సారాకు సంబంధించిన వార్తలు ఆస్ట్రేలియా మీడియాలో తరచూ వస్తుంటాయి.తాజాగా సారా కాళ్లకు ఇన్సూరెన్స్ చేయించడం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.అయితే సారా చిన్నప్పుడు కాళ్ల వల్ల ఎన్నో అవమానాలకు గురయ్యానని వెల్లడించడం గమనార్హం.

Telugu 1 Million Dollars, Australian Beauty, Beauty Quees, Insured Her Legs-Movie

అయితే తన కాళ్లు తనకు అందంగా మారతాయని ఊహించలేదని సారా చెప్పుకొచ్చారు.ఫుట్ బాల్ లో తను రాణించడానికి పొడవైన కాళ్లే కారణమని ఆమె తెలిపారు.తాను ఫుట్ బాల్ ఆటతో ప్రేమలో పడటం వల్లే కాళ్లకు ఇన్సూరెన్స్ చేయించానని ఆమె తెలిపారు.

సారా కాళ్లకు ఇన్సూరెన్స్ చేయించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఏకంగా ఇన్సూరెన్స్ కోసం 1 మిలియన్ డాలర్లు ఖర్చు చేయడంతో కాళ్ల కోసం ఇంత భారీ మొత్తం ఖర్చు చేస్తారా.? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

#Beauty Quees

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు