భారత్‌పై నిషేధం ముగిసింది... నేటి అర్థరాత్రి నుంచి ఆస్ట్రేలియాకు సర్వీసులు: స్కాట్ మోరిసన్

భారత్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.ఈ నిషేధాన్ని శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఎత్తివేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు.

 Australia Will Resume Repatriation Flights From India Soon, Says Pm Scott Morris-TeluguStop.com

అర్ధరాత్రి నుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెందిన వాణిజ్య విమానాలు యథావిధిగా నడుస్తాయని ఆయన వెల్లడించారు.అయితే కోవిడ్ నేపథ్యంలో విమానం ఎక్కడానికి ముందు కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తామని మోరిసన్ పేర్కొన్నారు.

భారత్‌పై నిషేధం వల్ల దేశంలో థర్డ్ వేవ్ రాకుండా అడ్డుకోగలిగామని ఆయన మరోసారి తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

కాగా, భారత్‌‌లో సెకండ్ వేవ్ కారణంగా ఇక్కడి నుంచి వచ్చే విమానాలపై ఆయా దేశాలు నిషేధం విధించాయి.

కానీ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ మాత్రం కాస్తంత ఓవరాక్షన్ చేశారు.మే 15 వరకు భారత విమాన ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్టు మే 3న ప్రకటించారు.

అదే సమయంలో భారత్ నుంచి వచ్చేవారితో పాటు సొంత పౌరులపైనా ఆయన బ్యాన్ విధించారు.ఇండియాలో 14 రోజుల పాటు ఉన్న ఆస్ట్రేలియా పౌరులు నిబంధనలను అతిక్రమించి స్వదేశంలోకి అడుగు పెడితే ఐదేళ్ల జైలుశిక్ష, రూ.49 లక్షల వరకు జరినామా విధిస్తామని మోరిసన్ హెచ్చరించారు.అయితే ప్రధాని నిర్ణయంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

భారత్‌లో క్లిష్ట పరిస్థితుల మధ్య వున్న ఆస్ట్రేలియన్లను స్వదేశానికి తీసుకురావడానికి కృషి చేయాలేకాని బెదిరించడం ఏంటని విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ నిర్ణయం పట్ల అంతర్జాతీయ మానవహక్కుల సంఘాలు కూడా మండిపడుతున్నాయి.

నీకెంత ధైర్యం.నీ చేతుల‌కు ర‌క్తం అంటుకుంది అని ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ మైకేల్ స్లేట‌ర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

అయితే ఈ నిషేధాన్ని మోరిసన్ సమర్థించుకున్నారు.దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఆస్ట్రేలియాలో థర్డ్ వేవ్ విజృంభణ రాకుండా నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారిసన్ వెల్లడించారు.ప్రధాని నిర్ణయంపై భారత్‌లోని బెంగళూరుకు చెందిన ఓ 73 ఏళ్ల వృద్ధుడు ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు కూడా.

Telugu Covid, India, Michael Slater, Primescott-Telugu NRI

కాగా, మోరిసనన్ నిర్ణయం వల్ల ఆస్ట్రేలియా క్రికెటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఐపీఎల్ ఆడేందుకు పెద్ద సంఖ్యలో ఆసీస్ ప్లేయర్లు భారత్‌కు చేరుకున్నారు.అయితే ప్రాంచైజీల్లో ఒక్కొక్కరిగా ఆటగాళ్లు కోవిడ్ బారినపడటంతో బీసీసీఐ ఐపీఎల్ 2021ని నిరవధికంగా వాయిదా వేసింది.దీంతో అన్ని దేశాల క్రికెటర్లు వారి స్వస్థలాలకు వెళ్లిపోగా.ఆసీస్ ఆటగాళ్లు మాత్రం భారత్‌లోనే చిక్కుకుపోయారు.ట్రావెల్ బ్యాన్‌ను అతిక్రమించి దేశంలోకి వస్తే జైలు శిక్ష తప్పదని ఆస్ట్రేలియా ప్రధాని హెచ్చరించగా.

ఇటు చూస్తే ఇండియాలో కోవిడ్ మరణ మృదంగం వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube