మరికొద్ది సేపటిలో ఆసీస్,ఇండియా మ్యాచ్... ఎదురుచూస్తున్న అభిమానులు  

Australia Vs India World Cup Match Will Start Soon-finch,india,kohili,match,world Cup,ఆస్ట్రేలియా జట్టు,టీమిండియా,ప్రపంచ కప్

ప్రపంచ కప్ లో ఈ రోజు మరో అద్భుత ఘట్టం మొదలు కానుంది. వరల్డ్ కప్ లో ఫెవరెట్ జట్లు గా ఉన్న ఆస్ట్రేలియా జట్టు,టీమిండియా లు తలపడనున్నాయి. తోలి రెండు మ్యాచ్ లలో విజయాన్ని అందుకున్న ఆసీస్ జట్టు మూడో మ్యాచ్ లో కూడా విజయాన్ని సాధించి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని చూస్తుంది..

మరికొద్ది సేపటిలో ఆసీస్,ఇండియా మ్యాచ్... ఎదురుచూస్తున్న అభిమానులు -Australia Vs India World Cup Match Will Start Soon

మరోపక్క తోలి మ్యాచ్ లో సఫారీ లను చిత్తు చేసిన టీమిండియా ఇప్పుడు రెండో మ్యాచ్ లో కూడా గెలిచి ప్రపంచ కప్ ఫేవరేట్ టీమ్ గా నిలవాలని చూస్తుంది. అయితే ఆసీస్ జట్టు లో కూడా స్మిత్,డేవిడ్ వార్నర్ లు తిరిగి రావడం తో ఇప్పుడు ఇరు జట్ల మధ్య టఫ్ ఫైట్ నడిచే అవకాశం కనిపిస్తుంది. దానికి తోడు మూణ్ణెల్ల ముందు మామూలు జట్టుగా కనిపించిన ఆసీస్ ఇప్పుడు అన్నీ విభాగాల్లోనూ తనదైన నైపుణ్యం సాధించింది.

వరుసగా 10 మ్యాచ్ లలో గెలుపొందిన ఫించ్ సేనకు కోహ్లీ సేన చెక్ పెడుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. మరి కొద్దిసేపట్లో ఈ మ్యాచ్ జరగనుంది. మరోపక్క టీమిండియా కూడా మంచి హుషారు మీద ఉంది. తోలి మ్యాచ్ లో సఫారీ లను ఓడించిన టీమిండియా ఇప్పుడు ఆసీస్ తో కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తుంది.

సఫారీలతో మ్యాచ్‌లో బౌలర్లు తమ బాధ్యత సక్రమంగా నిర్వర్తించారు. బ్యాట్స్‌మెన్స్ కూడా ఇంకాస్త జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. దీనితో ఈ మ్యాచ్ లో ఎవరు విజయాన్ని అందుకుంటారు అన్నది ప్రశ్నర్ధకంగా మారింది..