విదేశాల్లో భారతీయ సంపద.. చోరీకి గురైన క‌ళాఖండాల‌ను ఇండియాకు అప్ప‌గించ‌నున్న ఆస్ట్రేలియా

కళలకు, గొప్ప సంస్కృతికి, ప్రకృతి వనరులకు, అపార సంపదకు పుట్టినిల్లు భారతదేశం.అందుకే ఆనాదిగా ఈ రత్న గర్భ విదేశీ దండయాత్రలను ఎదుర్కొంది.

 Australia To Return Stolen Art To India-TeluguStop.com

నాటి అలెగ్జాండర్ నుంచి ఆంగ్లేయుల వరకు భారతదేశాన్ని కొల్లగొట్టిన వారే.దేశాన్ని చెప్పు చేతల్లోకి తీసుకోవడంతో పాటు ఇక్కడి సంపదను వారి స్వదేశాలకు తరలించుకుపోయారు.

వాటిలో కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనం తో పాటు ఎన్నో కళాఖండాలు, ముత్యాలు, పగడాలు, వజ్ర వైడూర్యాలు వున్నాయి.ఇక స్వాతంత్ర్యం వచ్చాకా స్వదేశంలోని దొంగల వల్ల మనదేశ సంపద ఖండాలు దాటుతోంది.

 Australia To Return Stolen Art To India-విదేశాల్లో భారతీయ సంపద.. చోరీకి గురైన క‌ళాఖండాల‌ను ఇండియాకు అప్ప‌గించ‌నున్న ఆస్ట్రేలియా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కోట్లాది రూపాయలు డబ్బుకు ఆశపడి కొందరు భారతీయులే దేవాలయాల్లోని సంపదను కొల్లగొట్టి విదేశాలకు విక్రయిస్తున్నారు.అలా భారతీయ సంపద.

విదేశాల్లోని ఆర్ట్ గ్యాలరీల్లో, మ్యూజియాల్లో మగ్గుతోంది.అయితే కొందరి కృషి వల్ల అలాంటి అపురూప సంపద తిరిగి భారతదేశానికి చేరుకుంటోంది.

తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.భారత్‌లో చోరీకి గురై అక్ర‌మంగా త‌మ దేశంలోకి వ‌చ్చిన క‌ళాఖండాల‌ను ఇండియాకు తిరిగి అప్ప‌గించాలని నిర్ణయించింది.మొత్తం 14 క‌ళాఖండాల‌ను అప్ప‌గించ‌నుండ‌గా ఇందులో ఆరు ఇండియాలో చోరీకి గుర‌వ‌డం లేదా ఆస్ట్రేలియాలోకి అక్ర‌మంగా వ‌చ్చిన‌ట్లు అక్క‌డి నేష‌న‌ల్ గ్యాల‌రీ గురువారం వెల్ల‌డించింది.క్యాన్‌బెర్రా గ్యాల‌రీ ఇప్ప‌టికే వీటిని గుర్తించింది.

వీటిలో శిల్పాలు, ఫొటోలు, పెయింటింగ్‌లు కూడా ఉన్నట్లు తెలిపింది.ఇవ‌న్నీ కూడా మ‌త‌, సాంస్కృతిక ప‌ర‌మైన క‌ళాఖండాల‌ని, వీటి విలువ దాదాపు 22 ల‌క్ష‌ల డాల‌ర్లుగా ఉంద‌ని అక్క‌డి గ్యాల‌రీ అధికారులు చెప్పారు.

వీటిలో కొన్ని 12వ శ‌తాబ్దానికి చెందిన‌వి కూడా ఉండ‌టం విశేషం.

వీట‌న్నింటినీ త్వరలోనే భార‌త ప్ర‌భుత్వానికి తిరిగి అప్ప‌గించ‌నున్న‌ట్లు గ్యాల‌రీ డైరెక్ట‌ర్ నిక్ మిట్జెవిచ్ చెప్పారు.త‌మ చ‌రిత్ర‌లోని ఓ క్లిష్ట‌మైన అధ్యాయానికి ఇలా ముగింపు ప‌ల‌క‌బోతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.వాటిని ఇండియాకు తిరిగి ఇవ్వ‌డం త‌మ‌కు ఎంతో ఊర‌ట క‌లిగించేద‌ని అన్నారు.

ఈ మొత్తం 14 క‌ళాఖండాల్లో 13 అక్ర‌మ ర‌వాణాదారు సుభాష్ క‌పూర్‌కు చెందిన‌వేనని నిక్ మిట్జెవిచ్ తెలిపారు.అత‌ని ద్వారా అందుకున్న ప‌లు క‌ళాకృతుల‌ను ఇప్ప‌టికే నేష‌న‌ల్ గ్యాల‌రీ తిరిగి ఇండియాకు అప్ప‌గించింది.

వీటిలో త‌మిళ‌నాడులోని ఆల‌యం నుంచి చోరీ చేసిన శివుని విగ్ర‌హం (నటరాజు) కూడా ఉంది.ఆ విగ్రహం విలువ సుమారు రూ.37.13 కోట్లు (50 లక్షల డాలర్లు) ఉంటుందని అంచనా

కళాఖండాల అప్పగింతకు సంబంధించి న్యాయపరమైన చిక్కుల గురించి తెలుసుకునేందుకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశామని మిట్జెవిచ్ తెలిపారు.ఆసియా నుంచి వచ్చిన మరో మూడు విగ్రహాల గురించి కూడా ఆరా తీస్తున్నామన్నారు.ప్రపంచంలోని చాలా ఆర్ట్ గ్యాలరీలకు ఈ సమస్య ఉండేదనని.

అయితే తాము కాలానుగుణంగా వీటిని పరిష్కరిస్తామన్నారు.

కాగా, మాన్ హాటన్‌లో విగ్రహాలను డీలింగ్ చేసే సుభాష్ కపూర్ అనే స్మగ్లర్‌పై అమెరికా దర్యాప్తు సంస్థ ‘ఆపరేషన్ హిడెన్ ఐడల్’ పేరిట దర్యాప్తు చేసింది.

కోర్టులో విచారణ కూడా జరగనుంది.అయితే, ఆ కథనాలన్నింటినీ కపూర్ కొట్టిపారేశాడు.తమిళనాడులో చోళుల కాలం నాటి 11, 12వ శతాబ్దపు హిందూ దేవతల విగ్రహాలనే కపూర్ ఎక్కువగా అక్రమ రవాణా చేసేవాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.2011లో అతడిని అరెస్ట్ చేసిన తర్వాత అమెరికా వందలాది కళాఖండాలను భారత్‌కు తిరిగిచ్చింది.

#Stolen Art #India #Australia #Nataraj Statue #Stolen Statues

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు