భారతీయులకు ఊరట: కోవిషీల్డ్‌ టీకాకు ఆస్ట్రేలియా సర్కార్ ఆమోదం

బ్రిటన్‌లాగా ఘర్షణ వాతావరణం లేకుండా సున్నితంగా కోవిషీల్డ్‌కు ఆమోదముద్ర వేసింది ఆస్ట్రేలియా ప్రభుత్వం.కోవీషీల్డ్‌తో పాటు చైనాకు చెందిన సైనోవాక్ టీకాలు ఇస్తున్న ర‌క్ష‌ణ ప‌ట్ల ఆస్ట్రేలియా ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్ సంతృప్తి వ్య‌క్తం చేశారు.

 Australia To Ease International Border Restrictions From Nov, Recognises Covishi-TeluguStop.com

అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌పై ఉన్న ఆంక్ష‌ల‌ను త్వరలో ఎత్తివేస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం కోవిషీల్డ్ టీకాకు ఆమోదముద్ర వేసింది.సైనోవాక్‌, కోవీషీల్డ్ టీకాలు వేసుకున్న అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌కు దేశంలో ఎలాంటి ఆటంకాలు ఉండ‌వ‌ని స్కాట్ మోరిసన్ తెలిపారు.

ఇప్పటి వరకు ఆదేశంలో ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా టీకాలకే అనుమతి వుంది.

కాగా, కోవిషీల్డ్‌ టీకాపై భారతీయులపై బ్రిటన్ సర్కార్ నిర్ణయం ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కొత్త ట్రావెల్ రూల్స్ ప్రకారం.కోవిషీల్డ్ రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న భారతీయులను యూకేలో టీకాలు వేయించుకోని వారిగానే పరిగణించబడతారని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.

అంతేకాకుండా దేశంలో అడుగుపెట్టిన భారతీయులు తప్పనిసరిగా 10 రోజుల పాటు క్వారంటైన్‌లో వుండాలని తేల్చిచెప్పింది.దీంతో విషయం భారత ప్రభుత్వం వరకు వెళ్లింది.

ఈ వ్యవహారం రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది.

Telugu Britain, Australia, Externalaffairs, Modern Takeda, Primescott-Telugu NRI

ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్వయంగా రంగంలోకి దిగారు.పరస్పర ప్రయోజనాలతో ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని యూకేను కోరారు.భారత్ విజ్ఞప్తితో కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిని సైతం అనుమతిస్తున్నట్లు యూకే నిబంధనలు సవరించింది.

సవరించిన మార్గదర్శకాల ప్రకారం.ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్, ఆస్ట్రాజెనెకా వాక్సేవ్రియా, మోడరన్ టకేడా వంటి వ్యాక్సిన్లను లిస్ట్‌లో చేరుస్తున్నట్లు యూకే తెలిపింది.

కానీ ఇక్కడే బ్రిటన్ మెలిక పెట్టింది.కొవిషీల్డ్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న భార‌తీయులకు కూడా క్వారంటైన్ త‌ప్ప‌నిస‌రి అని స్ప‌ష్టం చేసింది.స‌మ‌స్య కొవిషీల్డ్ కాద‌ని, ఇండియాలోని వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికేష‌న్‌పై అనుమానాలే అస‌లు స‌మ‌స్య అని చెప్ప‌ింది.అలాగే భారత్ వ్యాక్సిన్ స‌ర్టిఫికేష‌న్‌ను గుర్తించేందుకు ఇండియాతో క‌లిసి ప‌ని చేస్తున్న‌ట్లు యూకే ప్ర‌భుత్వం తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube