18 నెలల నిషేధానికి ముగింపు: అంతర్జాతీయ ప్రయాణీకులకు ఆస్ట్రేలియా అనుమతి...!!

ఆస్ట్రేలియాను కరోనా వైరస్ అల్లాడిస్తున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా డెల్టా వేరియంట్‌ కారణంగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

 Australia To Ease 18-month International Border Restrictions From November , Aus-TeluguStop.com

దీంతో కోవిడ్ చైన్‌ను బ్రేక్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం కఠినమైన లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది.ముఖ్యంగా దేశంలోనే పెద్ద నగరమైన సిడ్నీ, న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రాల్లో పరిస్ధితులు దారుణంగా వున్నాయి.

అలాగే విక్టోరియా రాష్ట్రం, మెల్‌బోర్న్‌లలో సైతం లాక్‌డౌన్ అమలవుతోంది.అయితే స్వేచ్ఛా ప్రియులైన ఆస్ట్రేలియన్లు నెలల తరబడి ఇళ్లలో మగ్గిపోవడానికి ఇష్టపడటం లేదు.

నాలుగు గోడల మధ్య నలిగిపోలేక ఆస్ట్రేలియన్లు పలుమార్లు రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు.సిడ్నీ, కాన్‌బెర్రా, మెల్‌బోర్న్, బ్రిస్బేన్ వంటి నగరాల్లో రోజూ ఎక్కడో ఒక చోట లాక్‌డౌన్ ఎత్తివేయాలని నిరసనలు జరుగుతూనే వున్నాయి.

ఊహించని ఈ పరిణామంతో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేసేందుకు గాను ప్రభుత్వం సైన్యాన్ని మోహరించింది.

మరోవైపు దాదాపు 18 నెలల నుంచి అంతర్జాతీయ ప్రయాణాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఎప్పటికప్పుడు దీనిని ఎత్తివేయాలని భావిస్తున్నప్పటికీ .దేశంలో డెల్టా వేరియంట్ కారణంగా వీలుపడటం లేదు.ఈ క్రమంలో అంతర్జాతీయ ప్రయాణాలకు శుభవార్త చెప్పారు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్.వచ్చే నెల నుంచి ఆస్ట్రేలియన్లు విదేశాలకు వెళ్లవచ్చని ఆయన ప్రకటించారు.పౌరులు, శాశ్వత నివాసితుల కోసం అంతర్జాతీయ సరిహద్దును తిరిగి తెరిచే ప్రక్రియ.దేశంలోని ఎనిమిది రాష్ట్రాలలో హోం క్వారంటైన్‌ను ఏర్పాటు చేయడంతో ముడిపడి వుందని మోరిసన్ అన్నారు.

ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలు ఇతర ప్రాంతాల కంటే వేగంగా తెరవబడతాయని ఆయన చెప్పారు.

మొదటి దశలో పౌరులు, శాశ్వత నివాసితులు ఆస్ట్రేలియా నుంచి విదేశాలకు వెళ్లడానికి అనుమతించడంపై దృష్టి పెడతామన్నారు.

అనంతరం విదేశీ ప్రయాణీకులను దేశంలోకి అనుమతించడంపై దృష్టి పెడతామని మోరిసన్ తెలిపారు.ఆస్ట్రేలియన్లకు వారి జీవితాలను తిరిగి ఇచ్చే సమయం వచ్చిందని ఓ మీడియా సమావేశంలో మోరిసన్ అన్నారు.

Telugu Australia, Brisbane, Canberra, Corona, International, Melbourne, Primesco

మార్చి 2020లో మోరిసన్ అంతర్జాతీయ సరిహద్దును మూసివేస్తున్నట్లు ప్రకటించారు.నాటి నుంచి పరిమిత సంఖ్యలో వ్యక్తులకు మాత్రమే వ్యాపారం, మానవతా దృక్పథంతోనే దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.పౌరులు, శాశ్వత నివాసితులు విదేశాల నుంచి తిరిగి రావడానికి అనుమతించబడ్డారు.అయితే వీరంతా తప్పనిసరిగా హోటల్‌లో వారి స్వంత ఖర్చులతో 14 రోజులు క్వారంటైన్‌లో వుండాలి.సినిమా, టీవీ నటులు.వ్యాపారవేత్తలకు మాత్రం ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది.

వచ్చే నెలలో మొదటి దశ హోం క్వారంటైన్ వ్యవస్థలు అమల్లోకి వస్తాయని తాము ఆశిస్తున్నట్లు మోరిసన్ అన్నారు.వ్యాక్సినేష‌న్ 80 శాతం దాటిన రాష్ట్రాల‌కు ట్రావెల్ ఆంక్ష‌ల‌ను ఎత్తివేయ‌నున్న‌ట్లు ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్ తెలిపారు.

ఆస్ట్రేలియ‌న్ల‌కు మ‌ళ్లీ త‌మ జీవితాల‌ను వెన‌క్కి ఇస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.ఈ క్రమంలో ద‌శ‌ల‌వారీగా 14 రోజుల హోట‌ల్ క్వారెంటైన్ రూల్‌ను ఆస్ట్రేలియా ఎత్తివేయ‌నున్న‌ది.దీనికి బ‌దులుగా వ్యాక్సిన్ వేసుకున్న ప్రయాణికుల‌కు ఏడు రోజుల హోం క్వారెంటైన్ విధించ‌నున్న‌ది.వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో సిడ్నీ, మెల్‌బోర్న్‌, కాన్‌బెర్రాలలో ఇంకా లాక్‌డౌన్ ఆంక్ష‌లు అమ‌ల‌వుతున్నాయి.

కాగా, శుక్రవారం ఆస్ట్రేలియాలో కొత్తగా 2,084 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.వీటిలో ఎక్కువ భాగం న్యూసౌత్‌వేల్స్, విక్టోరియా రాష్ట్రాలలోనే వెలుగుచూశాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube