చివరి నిమిషంలో మానవత్వాన్ని చాటిన రెస్టారెంట్ యాజమాన్యం.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

Australia Restaurant Shows Humanity Towards A Customer Who Ordered Food At Late Minute Of Closing

మానవత్వం కనుమరుగయ్యి, పక్క వాళ్ళు ఎలా చస్తే నాకేంటి నేను, నా కుటుంభం బాగున్నామా లేదా అనే ఆలోచించే మనుషులు ఉన్న ఈ కాలంలో ఇంకా మనుషులలో మానవత్వం అనేది చావలేదు అని ఈ రెస్టారెంట్ సిబ్బంది చేసిన పనే ఒక ఉదాహరణ అని చెప్పాలి.ఆకలితో ఉన్నవాళ్ళకి పట్టెడు అన్నం పెట్టి వాళ్ళ ఆకలి తీర్చే మనుషులను మనం చూసే ఉంటాము.

 Australia Restaurant Shows Humanity Towards A Customer Who Ordered Food At Late Minute Of Closing-TeluguStop.com

అలాగే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడిన గొప్ప మనుషుల గురించి కూడా మనం వినే ఉంటాము.అలాంటి వారిని చూసినప్పుడు ఇంకా మానవత్వం అనేది బతికే ఉందా అని.సరిగ్గా ఈ రెస్టారెంట్ యాజమాన్యం కూడా అలాంటి పనే చేసి ఒక మనిషి ఆకలి తీర్చింది.ప్రస్తుతం చాలామంది ఇంట్లో వంట చేసుకోలేని వారు ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకుని తింటున్నారు.

ఈ క్రమంలోనే ఒక వ్యక్తి కూడా రెస్టారెంట్ క్లోజ్ చేసే లాస్ట్ మినిట్ లో తనకు ఆన్ లైన్ ఫుడ్ కావాలని ఆర్డర్ చేయడంతో ఆ రెస్టారెంట్ వాళ్ళు చేసిన పని ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.చాలా మంది నెటిజన్లు అయితే ఆ రెస్టారెంట్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు కూడా.

 Australia Restaurant Shows Humanity Towards A Customer Who Ordered Food At Late Minute Of Closing-చివరి నిమిషంలో మానవత్వాన్ని చాటిన రెస్టారెంట్ యాజమాన్యం.. అసలు మ్యాటర్ ఏంటంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరి ఇంతకీ ఆ రెస్టారెంట్ ఏమి పని చేసింది.? చివరి నిమిషాల్లో ఆ వ్యక్తి ఆర్డర్ స్వీకరించారా లేదా అనే విషయాలు తెలుసుకుందామా.

Telugu Minute, Latest, Ordered, Shows Humanity, Unwell-Latest News - Telugu

ఈ సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది.ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి తనకు చాలా ఆకలిగా ఉందని, తనకి ఫుడ్ కావాలంటూ రెస్టారెంట్ కు ఆన్ లైన్ లో ఆర్డర్ చేశాడు.నిజానికి ఒక 14 నిమిషాల్లో ఆ రెస్టారెంట్ క్లోజ్ చేయబడుతుంది.అది గమనించిన ఆ వ్యక్తి తన ఫుడ్ ఆర్డర్ తో పాటు ఒక నోట్ ను కూడా ఆ రెస్టారెంట్ కు పంపించాడు.

నేను చివరి నిమిషంలో ఇలా ఫుడ్ ఆర్డర్ చేస్తున్నందుకు నన్ను క్షమించాలని, నాకు ఆరోగ్యం బాగా లేదని, అందుకే ఇప్పడే నిద్ర లేచినట్లుగా, నాకు బాగా ఆకలిగా ఉందని అందుకే ఇప్పుడే ఆర్డర్ చేయడం జరిగిందని ఆ నోట్ లో వివరించాడు.

Telugu Minute, Latest, Ordered, Shows Humanity, Unwell-Latest News - Telugu

ఒకవేళ తన ఆర్డర్ కనుక క్యాన్సిల్ చేస్తే మీ రెస్టారెంట్ క్లోజ్ అయ్యిందని నేను భావిస్తానని కూడా ఆ నోట్ లో తెలిపాడు.ఈ నోట్ ను చదివిన రెస్టారెంట్ సిబ్బంది అతనిపై మానవత్వం చూపించడంతో పాటు ఆ కస్టమర్ కు ఉచితంగా గార్లిక్ బ్రెడ్ కూడా పంపారు.అలాగే హోటల్ సిబ్బంది కూడా ఓ నోట్ ను పంపించారు.

లేట్ గా ఆర్డర్ చేసినందుకు బాధ పడకండి, మీరు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్ధిస్తున్నామని తెలిపారు.తన ఆర్డర్ చేసిన ఫుడ్ తో పాటు ఇలా గార్లిక్ బ్రెడ్ ను ఫ్రీగా పంపించడంతో ఆ వ్యక్తి చాలా సంతోషించి ఆ రెస్టారెంట్ కు 5స్టార్ రేటింగ్ కూడా ఇచ్చాడు.

ఈ విషయం తెలుసుకున్న రెస్టారెంట్ ఉద్యోగి ఈ ఘటనకు సంబందించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఆ పోస్ట్ కాస్త తెగ వైరల్ గా మారింది.

రెస్టారెంట్ ను, రెస్టారెంట్ సిబ్బందిని పొగిడే పనిలో పడ్డారు మన నెటిజన్లు.

#Ordered #Humanity #Minute #Unwell

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube