బీసీసీఐ విజ్ఞప్తిని తిరస్కరించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సిందే...

ఏడాది చివర్లో జరిగే ఆస్ట్రేలియా పర్యటనలో కోవిడ్-19 కు సంబంధించిన అంశాల్లో తమకు కొన్ని సడలింపులు ఇవ్వాలంటూ బి సి సి ఐ చేసిన విజ్ఞప్తినీ క్రికెట్ ఆస్ట్రేలియా తిరస్కరించింది.ప్రస్తుతం ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం విదేశాల నుంచి ఎవరు వచ్చినా సరే, కనీసం రెండు వారాల పాటు హోటల్ క్వారంటైన్ పాటించాల్సిందే.

 Australia Rejected Bcci Request... Quarantine Rules Must Be Followed.. Bcci, Cr-TeluguStop.com

భారత క్రికెట్ బోర్డ్ ఈ నిబంధనలు మా భారత ఆటగాళ్లను మానసికంగా దెబ్బ తీస్తుందని, దానికి బదులుగా బయో సెక్యూర్ బబుల్ లో సాధన చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరింది. భారత్, ఆస్ట్రేలియా గడ్డ పై మొదట బ్రిస్బేన్ లో అడుగు పెట్టాలి.

బ్రిస్బేన్ లో క్వీన్స్ ల్యాండ్ ప్రభుత్వం మాత్రం కోవిడ్ నిబంధనల్లో కఠినంగా వ్యవహరిస్తూ, ఏ మాత్రం సడలింపులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.ప్రపంచ దేశాల్లో ఏ దేశ మైనా,భారత క్రికెట్ జట్టు అయినా సరే, బ్రిస్బేన్ ప్రభుత్వ సూచనలు పాటించాల్సిందే అంటూ అక్కడి అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఐపీఎల్ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube