తొలి వన్డేలో దుమ్ములేపిన ఆసీస్.. పాపం 'శామ్ బిల్లింగ్స్'.!

మాంచెస్టర్ లో శుక్రవారం ముగిసిన తొలి వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌పై 19 పరుగుల తేడాతో విజయ దుందుభి మ్రోగించింది.మొదట బ్యాటింగ్ చేసిన కంగారూలు 9 వికెట్లు కోల్పోగా.294 పరుగులు చేశారు.ఇకపోతే ప్రత్యర్థి ఇంగ్లాండ్ మిడిలార్డర్ అయినటువంటి టాప్ బ్యాట్స్‌మెన్ శామ్ బిల్లింగ్స్ 110 బంతుల్లో 118 పరుగులతో సెంచరీతో చెలరేగిపోయాడు.

 Australia Beat England First Odi,one Day Match Australia Wins, England, One Day-TeluguStop.com

కానీ.అతని కష్టం నీరుగారిపోయింది.

ఎందుకంటే ఆట చివరకు వచ్చేసరికి ఆస్ట్రేలియా బౌలర్లు.ఇంగ్లాండ్‌ని 275/9 కే పరిమితం చేశారు.

ఇక దాంతో 19 పరుగులతో తేడాతో ఆస్ట్రేలియా ఇంగ్లాండు పైన ఘనవిజయం సాధించింది.

ఇక రెండో వన్డే మాంచెస్టర్‌ లోనే ఆదివారం జరగబోతోంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా చాలా తక్కువ స్కోరుకే చతికల పడే అవకాశం ఏర్పడింది.ఓపెనర్లు అయినటువంటి అరోన్ ఫించ్ (16), డేవిడ్ వార్నర్ (6) నిరాశ పరిచారు.

అలాగే మార్కస్ స్టాయినిస్ (43), లబుషేన్ (21), అలెక్స్ క్యారీ (10) కష్ట సమయంలో వికెట్లు పోగొట్టుకున్నారు.కానీ. గ్లెన్ మాక్స్‌వెల్ 59 బంతుల్లో 77 పరుగులు, మిచెల్ మార్ష్ 100 బంతుల్లో 73 పరుగులు హాఫ్ సెంచరీలు సాధించి, ఆరో వికెట్‌కి 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

దాంతో కొత్త ఉత్సాహం నింపుకున్న ఆస్ట్రేలియా మొత్తంగా 294 పరుగులు చేయగలిగింది.అయితే ఈ 295 పరుగుల లక్ష్య చేరువలో ఇంగ్లాండ్ కాస్త తడబడింది.ఓపెనర్ అయినటువంటి జేసన్ రాయ్ 12 బంతుల్లో 3 పరుగులు ఆరంభంలోనే పెవిలియన్ కు చేరాడు.

తరువాత బరిలో దిగిన జో రూట్ కేవలం ఒక పరుగు కూడా తేలికగా అవుట్ అయిపోయాడు.కానీ.మరో ఓపెనర్ జానీ బెయిర్ స్టో 107 బంతుల్లో 84 పరుగులు క్రీజులో నిలిచి చాలా సహనంగా హాఫ్ సెంచరీ చేసాడు.ఇకపోతే ఆఖరి వరకూ శామ్ బిల్లింగ్స్ (118: 110 బంతుల్లో 14×4, 2×6) చాలా గట్టిగా పోరాడాడు.కానీ.దానికి సపోర్ట్ ఇచ్చేవారు లేకపోవడంతో ఇంగ్లాండ్ 9 వికెట్ల నష్టానికి 275 పరుగులే చేయగలిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube