మైండ్ బ్లాక్ చేసిన డేవిడ్ వార్నర్... పార్ట్ 2 కూడా ఉందట...

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా క్రికెట్ మ్యాచ్లు లేకపోవడంతో ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టిక్ టాక్ లో  వీడియోలతో అదరగొడుతున్నాడు.ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయినటువంటి పొట్టి క్రికెట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో హైదరాబాద్ తరపున ఆడుతూ గ్రౌండ్ లో తనదైన శైలిలో సిక్సులు, ఫోర్లతో  రెచ్చిపోయేటువంటి డేవిడ్ వార్నర్ ఈ సారి తెలుగు హీరోలను అనుసరిస్తూ చేస్తున్నటువంటి వీడియోలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

 David Warner, Australia Cricketer, Mind Block Song, Tik Tok Video, Sarileru Ni-TeluguStop.com

తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించినటువంటి సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మైండ్ బ్లాక్ అనే పాటకి డేవిడ్ వార్నర్ తన భార్యతో కలిసి టిక్ టాక్ వీడియోలో స్టెప్పులు వేసాడు.దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఈ వీడియోని డేవిడ్ వార్నర్ టిక్ టాక్ మాధ్యమంలో షేర్ చేసి 50 నిమిషాలు కూడా గడవక ముందే దాదాపుగా 30 వేల పైచిలుకు లైకులు మరియు వెయ్యికి పైగా కామెంట్లు వచ్చాయి.దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు టిక్ టాక్ లో డేవిడ్ వార్నర్ రోజు రోజుకి ఎంతగా పాపులర్ అవుతున్నాడో అని.

కాగా ఈ విషయం ఇలా ఉండగా ఈ వీడియో చేయడానికి డేవిడ్ వార్నర్ మరియు అతడి భార్య దాదాపుగా 50 సార్లకు పైగా ప్రయత్నించారట.అందువల్ల ఈ వీడియోకి 500 కే లైకులు వస్తే పార్ట్ 2 కూడా చేస్తామని డేవిడ్ వార్నర్ తన అభిమానులకు తెలిపాడు.

అయితే గతంలో మహేష్ బాబు డైలాగులతో టిక్ టాక్ వీడియోలు చేసి అప్లోడ్ చేయగా దాదాపుగా ఐదు మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి.దీంతో అప్పటి నుంచి డేవిడ్ వార్నర్ తెలుగు అభిమానుల రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తూ టిక్ టాక్ వీడియోలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube