వామ్మో... రెండు నెలలు విడిచిన బట్టలు ఉతకలేదు, అయినా...?

కరోనా వైరస్ పుణ్యమా అని ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర ఉండి పని చేస్తున్న రోజులివి.చాలా మంది మొదట్లో ఈ ఆప్షన్ చాలా సులువుగా ఉంటుందని భావించారు.

 Austeria Women, Cloths, Viral, Coronavirus, Laundry Shop, Code Kwinly One-TeluguStop.com

అయితే ఇది కొందరికి బాగానే ఉన్నా మరికొందరికి మాత్రం మరింతగా పని ప్రభావం జరిగిందని తెలుస్తోంది.ముఖ్యంగా పెళ్లయిన వారికి వారి పిల్లలు స్కూళ్లు లేకపోవడంతో ఇంట్లోనే ఉండడంతో పనిచేసే సమయంలో వారి అల్లరి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇలాంటి సంఘటన తాజాగా ఆస్ట్రేలియా దేశంలో చోటు చేసుకుంది.

దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… ఆస్ట్రేలియా దేశానికి చెందిన కోడి క్విన్లి వన్ అని మహిళ గత రెండు నెలల నుండి తన పని ఎక్కువ ఉండడంతో రోజు బట్టలను ఉతకకుండా అన్నింటిని ఒక రూమ్ లో వేస్తూ వచ్చింది.

ఇది కాస్తా రెండు నెలలు దాటిపోవడంతో ఆ బట్టలన్నీ ఒక కొండలా పేరుకుపోయాయి.ఇక రెండు రోజుల తర్వాత వేసుకోవడానికి బట్టలు దొరకకపోవడంతో చేసేదేం లేక వాటన్నిటిని లాండ్రీ షాప్ కి పంపిస్తామని భావించింది.

అయితే లాండ్రీ కి పంపించే ముందు ఆమె ఆ బట్టలు అన్నిటినీ ఒకచోట పోగు చేసి వాటిపై ఎక్కి కూర్చుని ఫోటోకు ఫోజు ఇచ్చింది.ఆ సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది కోడి క్విన్లి వన్.ఇక ఆ పోస్టుకు మౌంట్ ఫోల్డ్ మోర్ మోర్ అని పేరును జత చేసింది.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా కొనసాగుతోంది.

ఈ ఫోటో సంబంధించిన అనేక మంది నెటిజన్లు వారి కామెంట్స్ ను జత చేస్తున్నారు.ఆ ఫోటోలో తాను మహారాణిలా ఇచ్చిందని కొందరు కామెంట్ చేస్తున్నారు.ఎందుకు బదులుగా కోడి క్విన్లి వన్ నేను ఒక్కదాన్నే అనుకున్నాను కాదు చాలా మంది అలాగే ఉన్నారు అందరూ ఆనందంగా ఉంది అని కామెంట్ చేసింది.ఇక లాండ్రీ కి ఆ బట్టల్ని పంపగా ఆ తర్వాత వాటిని ఉతికి ఐరన్ చేసి తిరిగి 50 సంచులలో ఆమెకు అప్పగించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube