ఆసిస్ కోచ్ జస్టిన్ లాంగర్ రాజీనామా.. కొత్త కోచ్ ఎవరంటే

ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్‌ జట్టు కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌కు చేదు అనుభవం ఎదురైంది.లాంగర్ తన పదవికి రాజీనామా చేశారు.

 Aussie Coach Justin Langer Resigns As New Coach,  Assis Coach, Resign, Latest Ne-TeluguStop.com

జూన్‌ వరకు ఒప్పందం ఉన్నా.ఫిబ్రవరిలోనే తను జట్టు కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.

ఈ విషయాన్ని లాంగర్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ డీఎస్‌ఈజీ శనివారం ప్రకటించింది.లాంగర్ కోచింగ్‌లో, ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్‌ను మొదటిసారి గెలుచుకోవడం నుంచి యాషెస్‌లో 4-0 విజయం వరకు ప్రధాన విజయాలను నమోదు చేసింది.

కొంద‌రు ఆట‌గాళ్ల‌తో పాటు గ‌వ‌ర్నింగ్ బోర్డులోని కొంద‌రు స‌భ్యుల‌తో విబేధాలు వ‌చ్చిన నేప‌థ్యంలో లాంగ‌ర్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.అయితే సుదీర్ఘకాలం తన పదవీ కాలాన్ని పొడిగించాలని లాంగర్‌ కోరగా.

క్రికెట్‌ ఆస్ట్రేలియా బోర్డు అందుకు ఒప్పుకోలేదు.ఈ విషయం గురించి చర్చించగా.

సానుకూల ఫలితం రాలేదు.దీంతో లాంగర్‌ రాజీనామా చేశారు.

అయితే వెంటనే క్రికెట్ ఆస్ట్రేలియా కూడా కొత్త కోచ్‌ను నియమించింది.లాంగర్ రాజీనామా చేసిన వెంటనే, క్రికెట్ ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ను తాత్కాలిక కోచ్ గా నియమించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది.

1993 నుండి 2007 వరకు 105 టెస్టులు ఆడిన లాంగర్ 45.27 సగటుతో 7696 పరుగులు చేశారు. షేన్ వార్న్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, గ్లెన్ మెక్‌గ్రాత్ మరియు రికీ పాంటింగ్ వంటి దిగ్గజాలతో కలిసి లాంగర్‌ ఆస్ట్రేలియన్ క్రికెట్‌ కు ఎనలేని సేవలు చేసి.జట్టును ఉన్నత స్థానాలకు చేర్చారు.

మరోవైపు ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌కు ఆస్ట్రేలియా తరపున 4 టెస్టులు మాత్రమే ఆడిన అనుభవం ఉంది.ఈ 4 టెస్టుల్లో ఆల్‌రౌండర్‌గా 107 పరుగులు చేసి 9 వికెట్లు పడగొట్టాడు.

మార్చిలో పాకిస్థాన్‌లో ఆస్ట్రేలియా పర్యటన జరగనుంది.

Aussie Coach Justin Langer Resigns As New Coach, Assis Coach, Resign, Latest News, Viral, Shane Warne, Adam Gilchrist, Glenn McGrath - Telugu Adam Gilchrist, Assis Coach, Glenn Mcgrath, Latest, Resign, Shane Warne, Ups

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube