వివాహేతర సంబంధాలు ఎంతలా ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నాయో చూస్తున్నాం.చాలా సంసారాలు కుప్ప కూలిపోతున్నాయి వీటి వల్ల.
కుటుంబాలకు కుటుంబాలే సమాధులు అవుతున్న ఘటనలు కూడా ఉన్నాయి.వీటిల్లో చాలా రకాలు ఉన్నాయి.
కొన్ని సార్లు మహిళలే భర్తలను కడతేర్చుతుంటే మరికొన్ని సార్లు భర్తలు భార్యలను హతమార్చుతున్న ఘటనలు కూడా చూస్తున్నాం.అయితే ఇప్పుడు ఓ వివాహేతర సబంధం చివరకు ఓ మహిళ ప్రాణాలు తీసింది.
ఓ మైనర్ జైలు పాలు అయ్యేలా చేసింది.
బెంగులూరుకు చెందిన మహిళా టైలర్ అఫ్రినా ఖానం మర్డర్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు.
ఇందులో ఆమె ప్రియుడే ఆమెను హతమార్చడం ఇప్పుడు సంచలనం రేపుతోంది.ఆమె పెట్టుకున్న అక్రమ సంబంధమే ఆమె ప్రాణాలను తీసిందని పోలీసులు గుర్తించారు.చాలా వరకు అక్రమ సంబంధాల్లో అడ్డుగా ఉన్న భర్తలను చంపడం లేదంటే పిల్లలను చంపడం మనం చూస్తున్నాం.కానీ ఇందులో మాత్రం మైనర్ ఏకంగా ఆమె ప్రియురాలినే చంపేశాడు.
ఓ మైనర్ స్టూడెంట్‌తో ఈమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఇలా వీరి సంబంధం కొనసాగుతుండగా ఇదికాస్తా హద్దులు దాటిపోయింది.ఇది ఎక్కడి దాకా వెళ్లిందంటే ఆ ప్రియురాలు ఆ అబ్బాయిని విడిచి బ్రతకలేని స్థాయికి వెళ్లింది.దాంతో ఎక్కడికైనా వెళ్లిపోయి పెండ్లి చేసుకుని హాయిగా బ్రతుకుదాం అంటూ మైనర్‌ను ఒత్తిడి చేయగా అతడు దానికి ఒప్పుకోలేదు.
ఇంకో విషయం ఏంటంటే డబ్బులు కావాలంటూ నిత్యం ఆ మహిళను వేధించేవాడు.దీంతో ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి.ఈ క్రమంలోనే ఆమెను అడ్డు తొలగించుకోవాలని అనుకున్న ఆ మైనర్ ఆమెను ఇంట్లోనే కత్తెరతో పొడిచి చంపేశాడని పోలీసుల విచారణలో తేలింది.దీంతో అతన్ని రిమాండ్‌కు తరలించారు పోలీసులు.
ఈ ఉదంతం అటు మహిళ కుటుంబంలో విషాదం నింపింది.