రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్టీఆర్ కుటుంబానికి కలిసి రాని ఆగస్ట్ నెల..!

అన్న ఎన్టీ రామారావు కుటుంబానికి వరుస విషాదాలు వీడటం లేదు.తాజాగా ఎన్టీఆర్ కుమార్తె అయిన ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని కన్నుమూసిన విషయం మనందరికీ తెలిసిందే.

 August Month Struggles To Ntr Family Details, Nandamuri Taraka Rama Rao, Nandamu-TeluguStop.com

ఎన్టీఆర్ కి ఎనిమిది మంది కుమారులు, నలుగురు కుమార్తెలు కాగా తొలి సంతానమైన రామకృష్ణ పదేళ్ల వయసులోనే మసూచి వ్యాధితో కన్నుమూయగా తన ఏడవ సంతానమైన మగపిల్లాడికి మళ్ళీ రామకృష్ణ అనే పేరు నే పెట్టుకున్నారు.అలా ఏడుగురు కొడుకులు నలుగురు, కుమార్తెలు మాత్రమే ఎన్టీ రామారావుకి ఉన్నారు.

వారిలో చిన్న కూతురు అయిన ఉమామహేశ్వరి తాజాగా కన్నుమూసింది.తన నివాసంలోనే చున్నితో ఉరిపోసుకుని తనువు చాలించింది.

ఇక కొన్నాళ్ల క్రితం ఎన్టీఆర్ కుమారుడైన హరికృష్ణ సైతం 2019 ఆగస్ట్ 29 న ఆక్సిడెంట్ లో కన్నుమూసిన విషయం తెలిసిందే.ఇక హరికృష్ణ కుమారుడు సైతం ప్రమాదంలో మరణించాడు.

అంతేకాదు ఎన్టీఆర్ మనవరాలైన కుమిదిని సైతం భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.అయితే ప్రస్తుతం ఉమామహేశ్వరి మరణంతో ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

అదేంటంటే ఆగస్టు నెల నందమూరి కుటుంబానికి రాజకీయం గాను, వ్యక్తి గతం గాను అలాగే కుటుంబ పరంగా కూడా కలిసి రావడం లేదంట.అయితే ఉమామహేశ్వరి ఆగస్టు ఒకటవ తారీఖున మధ్యాహ్నం పూట చనిపోగా, ఆగస్టు గండం నందమూరి కుటుంబానికి శాపంగా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Chandrababu, Hari Krishna, Nandamuri, Nandamuritaraka, Ntr August, Ntr, R

తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న ఎన్టీఆర్ కి మొదటిసారిగా 1984లో ఆగస్టు మాసంలో నాదెండ్ల భాస్కర్ రూపంలో ఒక గండం ఎదురైంది.ఎన్టీఆర్ పై నాదెండ్ల తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని చూసిన తర్వాత ఎలాగోలా ఆ గండాన్ని గట్టెక్కి అన్న గారు ఎన్టీఆర్ తిరిగి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

Telugu Chandrababu, Hari Krishna, Nandamuri, Nandamuritaraka, Ntr August, Ntr, R

ఇక 1994 ఆగస్టు నెలలో ఏకంగా వైస్రాయి హోటల్లో చంద్రబాబు చేసిన తిరుగుబాటుతో ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కూడా కాలేకపోయారు.ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన తీవ్ర మనస్తాపంతో గుండెపోటుకు గురై కన్నుమూశారు.ఈ విధంగా రాజకీయంగా ఆగస్టు సంక్షోభం ఎన్టీఆర్ ని ఎంతగానో కుదించింది అలాగే వరస మరణాలు కూడా ఆగష్టు నెలలోనే జరుగుతూ ఎన్టీఆర్ కుటుంబాన్ని కలచి వేస్తున్నాయి ఈ విధంగా ఆగస్టు మాసం ఎన్టీఆర్ కుటుంబానికి ఒక శాపంగా మారింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube