ఇంతకు సంపూ సినిమా పరిస్థితి ఏంటీ, ప్రేక్షకుల రియాక్షన్‌ ఎలా ఉందో తెలుసా?  

Audience Reaction About Shampoo Kobbari Matta-

నాలుగు సంవత్సరాలుగా ఊరిస్తూ వస్తున్న ‘కొబ్బరిమట్ట’ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హృదయకాలేయం తరహాలోనే చిత్రంలో కూడా పెద్దగా కథ అనేది ఏమీ లేదు. ప్రతీ సీన్‌ మరో సీన్‌కు పెద్దగా సంబంధం లేనట్లుగానే సాగుతుంది. కాని ప్రతి సన్నివేశం మరియు డైలాగ్‌ కూడా ప్రేక్షకులను నవ్వించే ఉద్దేశ్యంతోనే ఉంది..

ఇంతకు సంపూ సినిమా పరిస్థితి ఏంటీ, ప్రేక్షకుల రియాక్షన్‌ ఎలా ఉందో తెలుసా?-Audience Reaction About Shampoo Kobbari Matta

సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెడీని ఎంజాయ్‌ చేస్తున్నారు. కొందరికి ఇలాంటి కామెడీ నచ్చక పోవచ్చు. కాని మాస్‌ ఆడియన్స్‌లో ఎక్కువ శాతం ఇలాంటి కామెడీని ఇష్టపడతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రేక్షకుల రియాక్షన్‌ తీసుకుంటే వారు ఫుల్‌ ఖుషీగా ఎంజాయ్‌ చేసినట్లుగా అనిపించింది. మొదటి రోజు మొదటి ఆట నుండే థియేటర్లు ఫుల్‌ అవ్వడం గమనించవచ్చు. పలు ఏరియాల్లో హౌస్‌ ఫుల్‌ బోర్డులు కూడా పెట్టారట.

రచ్చ రచ్చ కామెడీతో సంపూర్నేష్‌బాబు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ప్రేక్షకులను నవ్వించేందుకు అతడు పడ్డ కష్టం సినిమాలో కనిపిస్తుంది. లెంగ్తీ డైలాగ్‌, కొన్ని డాన్స్‌ మూమెంట్స్‌ అతడికి ఎలా సాధ్యం అంటూ షాక్‌ అయ్యేలా ఉంది.

మొత్తానికి సంపూర్నేష్‌బాబు మరోసారి తనదైన శైలిలో కామెడీ చేసి నవ్వించాడు. అద్బుతమైన కామెడీతో అలరించాడు. ఎన్ని సినిమాలు పోటీ ఉన్నా కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్‌ రావడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు వచ్చిన కలెక్షన్స్‌ కూడా పాజిటివ్‌గా ఉన్నాయి.

మొదటి రోజు అన్ని ఏరియాలో కూడా మంచి ఓపెనింగ్స్‌ను ఈ చిత్రం రాబట్టింది. ఇక ఈ చిత్రం లాంగ్‌ రన్‌ లో 10 కోట్లు వసూళ్లు చేస్తుందనే నమ్మకంను చిత్ర యూనిట్‌ సభ్యులు కలిగి ఉన్నారు. పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా వారు కోరుకున్న వసూళ్లు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తుంది.