అలాంటి సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్లు.. మిగతా సినిమాలు డిజాస్టర్లా?

గత కొన్నేళ్లలో ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది.టికెట్ రేట్లు పెరగడం, థియేటర్లలో స్నాక్స్ ధరలు కళ్లు చెదిరే రేట్ ఉండటంతో ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను చూడాలి? ఎలాంటి సినిమాలను చూడకూడదు? అనే విషయాలకు సంబంధించి పూర్తి క్లారిటీతో ఉన్నారు.

ప్రస్తుతం ప్రేక్షకులు కొత్త తరహా కథలకు ఎక్కువగా ఓటేస్తున్నారు.

అదే సమయంలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, ఆకట్టుకునే కథాకథనాలు ఉన్న సినిమాలను మాత్రమే సక్సెస్ సక్సెస్ చేస్తున్నారు.ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలను చూస్తే ఈ విషయం సులువుగా అర్థమవుతుంది.

ఈ మధ్య కాలంలో హిట్టైన సినిమాలను గమనిస్తే అఖండ, పుష్ప ది రైజ్, డీజే టిల్లు, ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్2, విక్రమ్, బింబిసార, సీతారామం, కార్తికేయ2 సినిమాలు సక్సెస్ సాధించి నిర్మాతలకు కళ్లు చెదిరే రేంజ్ లో లాభాలను అందించాయి.కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలకే ప్రేక్షకులు ఓటేస్తున్నారు.

ఈ ప్రత్యేకతలు లేకుండా సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా ప్రేక్షకులు ఆ సినిమాలను ఆదరించే అవకాశాలు తగ్గుతున్నాయి.

Advertisement

కొన్ని సినిమాలను ఓటీటీలో చూద్దామని ప్రేక్షకులు ఫిక్స్ అవుతున్నారు.దసరాకు విడుదలైన రెండు సినిమాలకు హిట్ టాక్ వచ్చినా ఆ స్థాయిలో కలెక్షన్లు లేకపోవడానికి ఇదే కారణమని చెప్పవచ్చు.రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ సంఖ్య కూడా భారీగా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

స్టార్ హీరోల సినిమాలు మినహా ఇతర సినిమాలకు ఓపెనింగ్ కలెక్షన్లు సైతం ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం.ఓటీటీల హవా వల్ల ఈ మధ్య కాలంలో బుల్లితెరపై ప్రసారమవుతున్న సినిమాలకు సైతం మంచి రేటింగ్ రావడం లేదు.రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల శాటిలైట్ హక్కులకు కూడా డిమాండ్ తగ్గే ఛాన్స్ అయితే ఉంది.

సినిమాలను నిర్మించే నిర్మాతలు ఈ విషయాలను గమనించాల్సి ఉంది.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు