కేవలం 48 లక్షలకే ఆడీ ఆర్8 కారు....ఎక్కడో తెలుసా...!

సాధారణంగా మార్కెట్లో ఎక్కువ ధర ఉన్నటువంటి వస్తువులు అతి తక్కువ ధరకు దొరుకుతున్నాయి అంటే జనాలు ఎగబడటం చూస్తుంటాం.అయితే కొందరు కేటుగాళ్లు మార్కెట్లో బ్రాండెడ్ వస్తువులకి ఉన్నటువంటి క్రేజ్ ను ఉపయోగించుకొని ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు.

 Audi R8 Cost Is Only 48 Lakhs In Olx-TeluguStop.com

ఇందులో భాగంగా ఓ వ్యక్తి ఏకంగా రెండు కోట్ల రూపాయలు విలువ చేసే ఆడి కార్ ని ఉపయోగించిన వస్తువులను అమ్మటం మరియు కొనడానికి  ఉపయోగించే ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టాడు.

వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి రెండు కోట్ల విలువ చేసే ఆడి ఆర్ 8 కారుని కేవలం 48 లక్షల రూపాయలకు విక్రయిస్తున్నట్లు ఓఎల్ఎక్స్ యాప్ లో యాడ్ పోస్ట్ చేశాడు.

అయితే ఇందులో వెహికల్ కేవలం 18 వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగి ఉండి, ఇంటీరియల్ మరియు ఎక్స్టీరియర్ కూడా దాదాపు కొత్తగా కనిపించే విధంగా  ఉన్నాయి.దీంతో ఈ యాడ్ చూసినటువంటి పలువురు ప్రముఖులు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

అయితే రెండు కోట్ల రూపాయలు విలువచేసే కారును 48 లక్షల రూపాయలకి అమ్ముతున్నాడు అంటే అందులో ఏదో తిరకాసు ఉందని నెటిజన్లు అంటున్నారు.కారుని దగ్గరనుంచి చూసి  ప్రత్యక్షంగా పరిశీలించి కొనడం మేలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Telugu Audi Car, Audi, Audi Latest, Audi Coast-Latest News - Telugu

అయితే ఇది ఇలా ఉండగా ఖరీదైన వస్తువులను తక్కువ రేట్లకు ఆన్లైన్లో ఉంచడంతో పలువురు డబ్బు మోసాలకు గురవుతున్నారు.అంతేగాక గతంలో కూడా ఓ వ్యక్తి ఇ 1,70,000 విలువ చేసే టువంటి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ని కేవలం 45 వేల రూపాయలకే విక్రయిస్తున్నానని చెప్పడంతో ఏమి ఆలోచించకుండా వెంటనే డబ్బు పంపించాడు.అయితే అతను డబ్బు పంపిన మరుక్షణం నుంచి బైక్ యజమాని ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చింది.దీంతో బాధితుడు లబోదిబోమంటూ దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube