ఒలంపిక్స్ క్రీడాకారుల వ‌స్తువులు వేలం.. నీర‌జ్ చోప్రా ఈటెకు ఎంత ధ‌ర అంటే..?

మొన్న జ‌రిగిన ఒలింపిక్స్‌లో చాలామంది ప‌త‌కాలు సాధించిన సంగ‌తి తెలిసిందే.కాగా మొన్న ప్ర‌ధాని మోదీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న‌కు వ‌చ్చిన‌టువంటి బహుమతులను అధికారులు శుక్రవారం వేలం వేశారు.

 Auctions Of Olympics Athletes Auctioned How Much Is Neeraj Chopra Spear-TeluguStop.com

అయితే ఇందులో ప్ర‌ధానంగా టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ లో ఇండియాకు పతకాలు తీసుకువ‌చ్చిన వారు ఉప‌యోగించిన వాటికే విప‌రీత‌మైన డిమాండ్ ఏర్ప‌డింది.ఇక వ‌స్తువుల‌తో పాటు వారు వేసుకున్న దుస్తులు కూడా వేలానికి ఉంచారు.

ఇక ఒలంపిక్స్‌లో పోటీ ప‌డ్డ ఫెన్సింగ్ ప్లేయ‌ర్ అయిన భవానీ దేవి ఉప‌యోగించిన కత్తికి విశేషమైన ఆదరణ వ‌స్తోంద‌ని చెబుతున్నారు.

 Auctions Of Olympics Athletes Auctioned How Much Is Neeraj Chopra Spear-ఒలంపిక్స్ క్రీడాకారుల వ‌స్తువులు వేలం.. నీర‌జ్ చోప్రా ఈటెకు ఎంత ధ‌ర అంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఆమె వాడిన కత్తి ఇప్ప‌టికే రూ.10 కోట్ల మార్కును క్రాస్ చేసంది.ఇక దాంతో పాటు పారాలింపిక్స్ లో గోల్డ్ మెడ‌ల్ సాధించిన షట్లర్ కృష్ణ నాగర్, ఇంకో షట్లర్ అయిన సుహాస్ యతిరాజ్ లు వాడిన‌టువంటి రాకెట్ ల‌ను వేలంలో ఉంచ‌గా వాటికి కూడా విప‌రీత‌మైన ఆద‌ర‌న ద‌క్కింది.ఏకంగా రూ.10 కోట్ల మార్కు చేరుకున్నాయి.ఇక‌పోతే టోక్యో ఒలింపిక్స్ లోనే సంచ‌ల‌నం సృష్టించి దేశానికి తొలి, ఈ విభాగంలో ఏకైక స్వర్ణం ప‌త‌కం తీసుకువ‌చ్చిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఎంత ఫేమ‌స్ అయ్యాడో అంద‌రికీ తెలిసింందే.

Telugu Bhavani Devi Sword, Neeraj Chopra, Neeraj Chopra Spear In Auction Crossed Ten Crore Rupees, Olympics, Para Olympics, Pv Sindhu Racket-Latest News - Telugu

కాగా ఆయ‌న ఉపయోగించినటువంటి జావెలిన్ ఈటెను కూడ ఈ-వేలంలో ఉంచ‌గా దాని బేస్ ధ‌ర రూ.కోటి ద‌గ్గ‌ర మొద‌ల‌యినా కూడా అది ఎంతో ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది.ఇప్ప‌టికే రూ.10కోట్ల మార్కును క్రాస్ చేసి దూసుకుపోతోంది.ఇంకా వీటికి వేలం కొన‌సాగుతూనే ఉంది.ఇక‌పోతే పీవీ సింధు ఈ ఒల‌పింక్స్‌లో వాడిన‌టువంటి రాకెట్ కు రూ.80లక్షల ద‌గ్గ‌ర బేస్ ధర స్టార్ట్ కాగా.ఇప్ప‌టికే ఆమె రాకెట్‌కు రూ.9 కోట్ల మార్కు వ‌చ్చి ప‌డింది.ఇక ఈ వ‌స్తువుల వేలం వచ్చే నెల 7వ‌ర‌కు కొనసాగనుంద‌ని అధికారులు వెల్ల‌డిస్తున్నారు.

#NeerajChopra #Neeraj Chopra #Para Olym #Olym

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు